ప్రార్ధనలు
01. బ్రదర్ జోసఫ్ తంబి గారి ధన్యత పట్టము కొరకు ప్రార్ధన
పరిశుద్ధుడవైన మా తండ్రి! మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యాను సారముగా జీవిస్తూ, ప్రకటిస్తూ, పునీత అస్సీస్సీపుర ఫ్రాన్సిస్ వారి అడుగు జాడలలో నిరాడంబర జీవితము జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్య మిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితము సమర్పించి, సువార్తను ప్రకటించి, తిరుసభ యెడల విధేయత చూపించి, దేవమాత యెడల భక్తిని, బీదలపట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకముగా ఉండునట్లు దయ చేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు జోసఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహములో చేర్చు కొనండి.
పరిశుద్ధ మరియమ్మగారా, పునీత జోజప్పగారా, అస్సీస్సీపుర ఫ్రాన్సిస్‌గారా, సకల పునీతులారా! బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క ధన్యత పట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకములో కొనసాగునట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి.
మా ప్రేమగల తండ్రీ! మా విన్నపములను .............. బ్రదర్ జోసఫ్ తంబి గారి మద్యస్థ ప్రార్ధన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రీ. ఆమెన్.
పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రము
No comments:
Post a Comment