అధ్యాయము 06
ఉత్తర భారత దేశములోని ‘ఝాన్సి’లో జోసఫ్ తంబి
జోసఫ్ తంబిఅద్భుత రీతిన భారత దేశములో పలుచోట్ల
పర్యటించారు. ఎక్కడికి వెళ్ళినను పవిత్ర
జీవితాన్ని, ప్రార్ధనా జీవితాన్ని, సేవా జీవితాన్ని జీవించారు.
జనవరి నెల,
ఆదివారము, 1944వ సంవత్సరము! ఝాన్సి నగరం! మిలిటరీ ప్రాంతం. జేసు తిరు
హృదయ దేవాలయం! మిలిటరీ దేవాలయం! దేవాలయములో దివ్యపూజాబలి జరుగుతుంది. చందా పడుతూ
ఉన్న తోమాసు ఎం. కురిసింకల్ అనే వ్యక్తి గుడి మధ్యలో భిక్షగానివలెనున్న జోసఫ్
తంబిగారిని గమనించాడు. జోసఫ్ తంబిగారి చేతిలో ఏదో లతీను పుస్తకం ఉండటము
గమనించాడు.