జోసఫ్ తంబిగారు తరుచుగా
క్రీస్తు ప్రభువు పొందిన పంచ గాయాలను పొందేవారు. ఎంతోమంది ప్రత్యక్ష సాక్షులు తమ
సాక్ష్యాలను ఇచ్చియున్నారు. ఇప్పటికే, పై పీజీలలో జోసఫ్ తంబిగారి పంచగాయాల గురించి చదివి
యున్నాము. ఇచ్చట జోసఫ్ తంబిగారి పంచగాయాల గూర్చిన మరికొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.
‘ఇతను ఎవరు! ఈ సమయములో ఇక్కడ
ఎందుకు ఉన్నారు!’ అని
విన్సెంజో గురువులు ఆశ్చర్య పోయారు. విన్సెంజో గురువులు గమనించగా, జోసఫ్ తంబిగారి
చేతులు, కాళ్ళు, రొమ్ముపై
రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏమి జరిగింది?’ అని విన్సెంజో గురువులు జోసఫ్
తంబిగారిని అడుగగా, ‘‘ఏదో
జబ్బు చేసింది స్వామీ! దయచేసి ఇక్కడ కడుక్కోనివ్వండి’’ అని అన్నారు.
అందుకు విన్సెంజో గురువు,
‘బ్లేడులతో, మేకులతో
జాగ్రత్తగా ఉండాని తెలియదా!’ అని గద్దిస్తూనే, ఏదో ప్రత్యేకత ఉన్నదని మనసులో అనుకుంటూ, తన గదిలోనికి
తీసుకొని వెళ్ళాడు. చేతులమీద నీళ్ళు పోస్తూ ఉండగా, బాధ విపరీతమయ్యే సరికి నీళ్ళు పోయడం
ఆపి వేసారు. కొన్ని నిమిషాల తరువాత, హఠాత్తుగా, జోసఫ్ తంబిగారి ముఖము తేజోవంత మవ్వగా, చిరునవ్వుతో, ‘‘జబ్బు
తగ్గిపోయింది’’ అని
అంటూ వేగముగా కాళ్ళు చేతులు కడుగు కున్నారు. అంతకుముందు విన్సెంజో గురువులు
గమనించిన అంగుళం లోతు గాయాలు మచ్చుకైనా కనిపించలేదు.