Showing posts with label D. ‘పచ్చమలై’లో. Show all posts
Showing posts with label D. ‘పచ్చమలై’లో. Show all posts

Monday, July 6, 2020

‘పచ్చమలై’కు పయనం

అధ్యాయము 04
‘పచ్చమలై’కు పయనం

క్రీ.శ. 1936వ సంవత్సరములో ‘మణత్తిడల్‌’ గ్రామమునకు గురుశ్రీ ఇగ్నేషియస్‌ వారి రాకతో జోసఫ్‌ తంబిగారు ముందుగా ‘కొత్త పాలాయం’ అను విచారణకు వెళ్ళారు. అక్కడ విచారణ గురువులైన గురుశ్రీ అధిరూపం వద్ద పది రోజులు ఉన్నారు. తక్కువ సమయములోనే గురుశ్రీ అధిరూపంతో జోసఫ్‌ తంబిగారికి చక్కటి స్నేహం, అనుబంధం ఏర్పడినది.

‘కొత్త పాలాయం’ నుండి ‘తొండమందురై’ అను ప్రదేశమునకు వెళ్లి, అచటనుండి ‘పచ్చమలై’ అను మారుమూల గ్రామమునకు వెళ్లి యున్నారు. ఇది ‘కొత్త పాలాయం’ విచారణకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ‘పచ్చమలై’ అనునది తిరుచిరాపల్లి జిల్లాలోని కొండ ప్రాంతం. ‘కుంభకోణం’ మేత్రాసణములోని ‘తొండమందురై’ విచారణ సమీపములో ఉన్నది. ఇది గిరిజనుల (ఆదివాసీల) ప్రాంతం. ఆ గ్రామములో జోసఫ్‌ తంబిగారు స్వయముగా ఒక గుడిసెను నిర్మించుకొని దానిలో నివసించేవారు. ఆరంభములో కొండజాతి ప్రజలు జోసఫ్‌ తంబిగారిని వింతగా చూసారు. కాలం గడిచే కొద్ది ప్రజలు అతనికి దగ్గరయ్యారు. జోసఫ్‌ తంబిగారు వారితోనే జీవించారు. వారు భుజించేదే, తాను భుజించాడు.