Saturday, July 4, 2020

ఉత్తర భారత దేశములోని ‘ఝాన్సి’లో జోసఫ్ తంబి

అధ్యాయము 06
ఉత్తర భారత దేశములోని ‘ఝాన్సి’లో జోసఫ్ తంబి

జోసఫ్‌ తంబిఅద్భుత రీతిన భారత దేశములో పలుచోట్ల పర్యటించారు. ఎక్కడికి  వెళ్ళినను పవిత్ర జీవితాన్ని, ప్రార్ధనా జీవితాన్ని, సేవా జీవితాన్ని జీవించారు.

జనవరి నెల, ఆదివారము, 1944వ సంవత్సరము! ఝాన్సి నగరం! మిలిటరీ ప్రాంతం. జేసు తిరు హృదయ దేవాలయం! మిలిటరీ దేవాలయం! దేవాలయములో దివ్యపూజాబలి జరుగుతుంది. చందా పడుతూ ఉన్న తోమాసు ఎం. కురిసింకల్‌ అనే వ్యక్తి గుడి మధ్యలో భిక్షగానివలెనున్న జోసఫ్‌ తంబిగారిని గమనించాడు. జోసఫ్‌ తంబిగారి చేతిలో ఏదో లతీను పుస్తకం ఉండటము గమనించాడు.

పూజ ముగిసిన వెంటనే తోమాసు ఎం. కురిసింకల్‌, జోసఫ్‌ తంబిగారిని కలిసి, చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని, ‘నీకు లతీను చదవడం వచ్చా?’ అని ఆశ్చర్యముతో అడిగాడు. నీకు చదవడం రాదేమో, కాని నాకు వచ్చుఅని సమాధాన మిచ్చారు. అలా జోసఫ్‌ తంబిగారితో మాట్లాడిన కొన్ని క్షణాలలోనే, ఆయన భిక్షగాడు కాదని, ఒక సాధారణమైన వ్యక్తి కాదని తోమాసుకు అర్ధమైయ్యింది. ఇక అప్పటినుండి వీరిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. తరుచుగా కలుసుకొనెడివారు.

తోమాసు ఎం. కురిసింకల్‌ పూజా సామాను గదిలోనే నివసిస్తూ ఉండేవాడు. తరుచుగా జోసఫ్‌ తంబిగారు అతనిని సందర్శించేవాడు. మిలిటరీ శిభిరాలలో భిక్షాటన చేస్తూ, ఎండిన చపాతీలను తీసుకొని వచ్చేవారు.

ఒకరోజు తోమాసు ఎం. కురిసింకల్‌ వారిని సందర్శించడానికి వచ్చినప్పుడు, జోసఫ్‌ తంబిగారు పంచగాయాలను పొందియున్నారు. హఠాత్తుగా నేలపై పడిపోయాడు. చేతులనుండి, కాళ్ళనుండి, ప్రక్కనుండి రక్తము స్రవిస్తూ ఉంది. తోమాసు ఎం. కురిసింకల్‌ వారు దూదితో రక్తాన్ని తుడిచాడు. అప్పుడు జోసఫ్‌ తంబిగారు, ‘‘మన ప్రభువు శ్రమలను అనుభవిస్తున్నారు. ప్రాయశ్చిత్తం అవసరం’’ అని పలికారు.

ఒకరోజు జోసఫ్‌ తంబిగారితో మాట్లాడిన తరువాత, తోమాసు ఎం. కురిసింకల్‌ వారు 13 రోజు ఆరాధనకు సైకల్‌ మీద మరొక వ్యక్తితో కలిసి వేరే దేవాలయునకు వెళ్ళుచున్నాడు. అతను ఆ దేవాలయమునకు వెళ్ళేసరికి, అప్పటికే జోసఫ్‌ తంబిగారు అక్కడ ఉన్నారు. ఎలా వచ్చావు?’ అని ఆశ్చర్యముతో అడిగినప్పుడు జోసఫ్‌ తంబిగారు, ‘‘నేను ఎక్కడికైన వెళ్లాని అనుకున్నప్పుడు, ఒక శక్తి నా భుజమును తట్టి, పైకిలేపి, ఆ స్థలమునకు నన్ను తీసుకొని వెళ్తుంది’’ అని సమాధానమిచ్చారు.

తోమాసు ఎం. కురిసింకల్‌ వారికి జోసఫ్‌ తంబిగారి గురించి తెలిసిన గురుశ్రీ జోసఫ్‌ చుంగాత్‌ వారితో కూడా పరిచయం ఉంది. ఒక మిలిటరీ వ్యక్తినుండి వారి అడ్రస్‌ను సంపాదించి, జోసఫ్‌ తంబి గురించి తనకు తెలిసిన విషయాను ఒక లేఖ ద్వారా జోసఫ్‌ చుంగాత్‌ గారికి తెలిపియున్నాడు.

తోమాసు ఎం. కురిసింకల్‌ వారు జోసఫ్‌ తంబి సమాధిని క్రీ.శ. 1949, మరియు 1983 సంవత్సరాలో సందర్శించి యున్నారు. ఝాన్సిలో ఉన్నప్పుడు, తోమాసు ఎం. కురిసింకల్‌ వారు జోసఫ్‌ తంబి నుండి ఒక పెద్ద జపమాలను స్వీకరించాడు.

తోమాసు ఎం. కురిసింకల్‌ వారికి జోసఫ్‌ తంబిగారు ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక సలహా ఏమిటంటే: ‘‘మానవులందరు గడ్డి మొక్కల వంటివారు. వారి వైభవము గడ్డిపూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కాని దేవుని వాక్కు ఎ్లప్పుడును నిలచును అని పరిశుద్ధ గ్రంధము పలుకు చున్నది. సువార్త మీకు అందించిన సందేశము ఇదియే’’ (1 పేతురు 1:24-25).

తోమాసు ఎం. కురిసింకల్‌

No comments:

Post a Comment