Wednesday, April 22, 2020

సాక్ష్యం 41

సాక్ష్యం 41

గోడే రూతమ్మ
వట్లూరు
70 సంవత్సరాలు

నా పేరు రూతమ్మ. నా చిన్న తనములో తంబిగారితో పరిచయం. తంబిగారు, నేను, పిల్లలతో కలిసినపుడు కొంత మంది మగ పిల్లలు రాళ్ళు వేసి కొట్టారు. నేను తంబిగారి చేయి పట్టుకొని తిరుగుతుండే దానిని. మా మేనత్త ఇంటి ప్రక్కనే ఒక గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. ఒకసారి అలా కొడుతుంటే అందరం గుంపుగా చేరి తంబి గారిని ఆ ముసలమ్మ ఇంటికి తీసుకు వెళ్ళాము. “అమ్మా! నాకు ఆహారం కావాలి” అని వచ్చీ రాని భాషలో మాట్లాడాడు. ‘నాకు లేదు స్వామిఅని చెప్పింది ముసలమ్మ. “అమ్మా! అన్నం పెట్టమ్మా, నాకు ఆకలిగా వుందిఅన్నారు. ‘ఏం లేదు, పెట్టేవాళ్ళు లేరు, వండ లేదుఅన్నది ముసలమ్మ. తంబి గారు, “అమ్మా! వుంది. పెట్టుఅన్నారు. ‘నేను అన్నము వండలేదుఅన్నది ముసలమ్మ. “నూకల జావా, ముసలమ్మ వండుకున్నదేమో దాసిపెట్టి నేను వండు కోలేదని అంటుంది. జావ నీవు చేసుకున్నావు కదా! మూత తీసి చూపించ మంటావా? నీ ఇంట్లో జావ వుంది కదాఅన్నారు తంబి గారు. ముసలమ్మ ఆశ్చర్య పడిఅయ్యా నీకెలా తెలుసుఅని అడిగినపుడునేను తెలుసుకున్నాఅని చెప్పారు. అప్పుడు ఇంత గోంగూర పచ్చడి తెచ్చినంచు కోండిఅని ఒక ప్లేట్లో జావ పోసిస్తే త్రాగేసారు.

అక్కడ నుండి క్రొత్త మాలపల్లి వెళ్ళాము. తంబి గారితో పాటు మేము పిల్లల మందరం కూడా వెళ్ళాము. అక్కడ ఒక ఇంటికి వెళ్ళాము. భార్యా భర్తలిద్దరూ ముసలి వాళ్ళే. పాతపల్లి నుండి మేకల జార్జి అనే ఆయన కూడా వచ్చాడు. “అమ్మా! ఏం కూర తయారు చేశావుఅంటేఏం లేదు స్వామిఅన్నది. “ఏం చేయలేదా? నీ ఇంట్లో కూర లేదా?” అని ఇట్లే అడిగేశారు. ఆమె చిన్న చాపలు ఏవో బెత్తలు తెచ్చి వండుకుంది. “కొంచెం తీసుకు రామ్మాఅంటే ఆమె మూతలో కొంచెం తీసుకు వచ్చింది. తంబి గారు రెండు చేపలు మాత్రమే తిన్నారు. తర్వాత పాత మాలపల్లి వెళ్లి తిరిగి వచ్చాడు. అందరం మళ్ళీ కలిసాము. ఇక అక్కడ నుండి మా ఇంటి దగ్గరికి వచ్చినపుడు, నేను ఇంటికి వెళ్లి పోయాను. చర్చి వైపు వెళ్ళారు. ఇక ఎక్కడికి వెళ్ళారో తెలియదు.

అప్పుడు నాకు పది సంవత్సరములు వయస్సు. 18వ సం.లో వివాహం జరిగింది. తంబి గారంటే ఇప్పటకీ నాకు చాలా విశ్వాసం. ఒక రోజు నా కంట్లో నలుసు పడింది. ఏడు, ఎనిమిది రోజులు భాద పడ్డాను. కండ్లు ఎర్రగా అయిపోయి, భాదతో ఏడ్చే దానిని. పూజలో వున్నప్పుడు నేను తంబి గారిని తలంచుకొని, ‘తంబి గారా! నేను నీ దగ్గరికి వస్తున్నాను కదా! ఎందుకు నాకు ఈ శిక్ష వేస్తున్నావు?’ అని ప్రలాపించి ఏడ్చి, ఒక పరలోక జపం చెప్పుకునే సరికి నా భాద తగ్గి పోయింది. వెంటనే నా భర్తను వెంట తీసుకుని ఇక్కడికి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి దాకా ప్రతి నిత్యం వస్తున్నాను.


No comments:

Post a Comment