Thursday, April 23, 2020

సాక్ష్యం 40

సాక్ష్యం 40

లింగతోటి మరియమ్మ
మానికొండ
70 సంవత్సరములు

నా పేరు లింగతోటి మరియమ్మ. ఊరు మానికొండ. తంబి గారు మా ఊరు వచ్చినప్పటి నుండి నాకు పరిచయము. అసలు ఎక్కడికీ వెళ్ళరు. గుడి దగ్గరే వుంటారు. మా పెద్దమ్మ ప్రొద్దుటూరు నుండి స్వామిని తీసుకు వచ్చింది. మా పెద్దమ్మ అలివేలమ్మ గాని లేయమ్మ అంటాం. తంబి గారికి, క్లారమ్మ గారికి ఆమె బాగా పరిచయం. ఆమె కూతురు, అల్లుడు మానికొండలో బడి నడిపిస్తున్నారు. స్వామి ఎక్కువగా బడి దగ్గరే ఉంటారు. ‘అమ్మో! స్వామి వచ్చారుఅని అందరూ పొలం నుంచి తట్టలు అక్కడే పడేసి వెళ్ళి పోయే వాళ్ళు. వెళ్ళిన తర్వాత, “అమ్మా! నీవు అక్కడ దొంగతనం చేశావు, ఇక్కడ దొంగతనం చేశావుఅనే వారు. ఎదిగిన వాళ్ళను అలా అనే వారు. అప్పుడు మేము చిన్న వాళ్ళం. ఇక వాళ్ళందరూ వినేవారు. “ఏంటమ్మో ఇట్లా అంటున్నారుఅని మెదల కుండా వచ్చేసే వాళ్ళు. మేమేమో ప్రక్కల నుండి చూడటం, నేను ఆయనతో తిన్నగా ఏమీ మాట్లాడ లేదు. ఇక అవి చూడటం మట్టుకే.

ఆయన చనిపోయిన తరువాత ఆయన ఫోటో తీయించు కున్నాము. మా ఇంటికి ఆయన ఎప్పుడూ రాలేదు. ఇంటికి రాలేదు కాని, మా ఆయన తంబి గారితో చాలా స్నేహంగా ఉండే వారు. ఆయన గారితో చెప్పిన వన్నీ, మా ఆయన నాకు చెప్పే వారు.

లింగతోటి మరియమ్మ, మానికొండ

No comments:

Post a Comment