Friday, April 24, 2020

సాక్ష్యం 39

సాక్ష్యం 39

చవుటపల్లి అమృతమ్మ
తేలప్రోలు
75 సంవత్సరములు

నా పేరు సమాధానం అయితే అమృతమ్మ అని పిలుస్తారు. మా అత్తగారిల్లు తేలప్రోలు. తేలప్రోలు వచ్చిన తర్వాతనే తంబి గారితో పరిచయం ఏర్పడింది. తంబి గారిని చూసి వారితో తిరిగినాను. వారితో పెద్ద పరిచయం లేదు. ఒక రోజు వారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ముగ్గు వేస్తున్నాను. “అమ్మా! నీవు ఏం ముగ్గు వేస్తున్నావు?” అని అడిగారు. ‘సంక్రాంతి ముగ్గు వేస్తున్నాను’ స్వామి అన్నాను. “అది మనం వేయకూడదుఅన్నారు. ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ముగ్గువేయడం మాని వేశాను.

నేను పెద్ద కొడుకుని కన్నాను. రెండవ కొడుకు జోజితో నీళ్ళు పోసుకొని యున్నాను. జోసఫ్ తంబి గారు అప్పటికి చనిపోయారు. పండగకు వస్తున్నాను. మా అత్తగారునీవు నీళ్ళు పోసుకొని యున్నావు, కడుపు పోతుంది వెళ్ళకుఅని అన్నది. నేను తంబి గారి మీద దీక్ష పెట్టుకొని వచ్చేశాను.

‘మగ పిల్లోడు పుడితే జోజప్ప గారి పేరు పెట్టుకుంటాం, ఆడపిల్ల పుడితే జోజప్పానమ్మ అని పెట్టుకుంటాం’ అని అనుకున్నాను. ‘వెళ్ళటమే వెళ్ళటం’ అనేసి వచ్చాను. కొడుకు పుట్టాడు క్షేమంగా వున్నాడు. బుద్దికూడా మంచిదే.


No comments:

Post a Comment