సాక్ష్యం 37
పోలంగి జసఫ్
తంబి జోజప్ప గారు వ్యాధి గ్రస్తులను
ఆరోగ్య పరచి, స్వస్థపరచి ఫ్రాన్సీసు వారి
మాదిరిగా వీరు కూడా జీవితం వెళ్ళ బుచ్చినారు. ఈ విధంగా వారు ఆంధ్ర దేశమునకు వచ్చి, వారు పడిన పాట్లు, శ్రమలు అన్నీ దేవునికి
అంకితం చేసిన వారు.
వారి ద్వారా కొన్ని
అద్భుతములు కూడా జరిగాయి. జేసునాధ
స్వామికి ఏవిధముగానైతే పంచ గాయాలున్నాయో అదేవిధముగా, వీరికి కూడా పంచ గాయాలు కనిపించాయి. ఈ గాయముల వల్ల కొంత మందిని ఆయురారోగ్య
పరచి యున్నారు.
కుష్టు రోగులను
ఆయన స్వంత బిడ్డలుగా ఆదరణతో ముద్దు పెట్టుకొని యున్నారు.
జార్జి స్వాములవారు ఒకరోజు ఇక్కడికి
వచ్చినారు. ఆ రోజు జోజప్ప గారితో, ‘జోజప్ప గారూ! మా గ్రామం వట్లూరు. తమరు రావలయును’ అని అన్నారు. అప్పుడు తంబిగారు ఏమన్నారంటే, “ఇప్పుడు మేము రావటానికి అవకాశం లేదు. ఇంకొకసారి వస్తాను” అన్నారు. ‘మాకు విచారణ పండుగ వున్నది. చాలా బాగా చేస్తారు. మీరు తప్పక రావాలి’ అన్నారు స్వామి. “సరే వస్తాను” అని మాట పట్టు ఇచ్చారు. జార్జి స్వామి తెల్లారగట్ట ఐదు గంటలకు
బండికి వెళ్లి పోయారు. తంబిగారు
ఇక్కడే తెల్లగా తెల్లారిన తరువాత డికాషన్ పుచ్చుకొని బయలు దేరారు. వీరు బయలు దేరేటప్పుడు కొంతమంది ప్రజలు
చూసారు. రోడ్డు మీద పోయే వరకు చూసారు. ఇక రోడ్డు ఎక్కిన తర్వాత వారు ఎటు పోయింది
కూడా తెలవదు. ఈ జార్జి స్వాముల వారు తేలప్రోలు
స్టేషన్ సమీపములో ఉన్నప్పుడు ఈ జోజప్ప గారు వట్లూరు చర్చిలో వున్నారు. ఆ చర్చిలో వెళ్ళి నప్పుడు ఇద్దరు టీచర్లు, ఒక పంతులు వున్నారు. జార్జి స్వామి వెళ్లి చూసాడు. ‘వీరు ఏ సమయానికి వచ్చారు ఏంటి?’ అని అడిగారు. ఇదిగో ఫలానా టైంకి వచ్చారని ఆ టీచర్లు
వారంతా చెప్పారు.
మీరు చెప్పిన ప్రకారం
వీరు వచ్చిన టైంకి తేలప్రోలు స్టేషన్ లోనే వున్నారు. అక్కడ నుండి వారు వెంటనే అవుటపల్లికి
టెలిగ్రాం ఇచ్చారు.
కల్దిరారో స్వామి
నమ్మినట్లు వున్నారు. మీరు
త్వరగా ఒకరోజు ఇక్కడికి వచ్చి ఆ విషయం చెప్పాలి అన్నారు కల్దిరారో స్వామి. జార్జి స్వామి మరల ఒకరోజు ఇక్కడికి వచ్చినపుడు
జోజప్ప గారి విషయమంతా చెప్పారు. అప్పటినుండి కల్దిరారో స్వామి గట్టిగా నమ్మారు.
ఒక పర్యాయము జార్జి స్వామి గుణదల వెళ్లారు. పోయేముందు, “నేను కూడా వస్తాను. నాకు కూడా పని వుంది. బెజవాడలో పని వుంది. నేను వస్తాను” అన్నారు తంబిగారు. ‘నీవు ఇప్పుడు రావడానికి కుదరదు. ఇప్పుడు అవసరము లేదు. ఇంకో పర్యాయము వెళ్ళవచ్చు, అని లేక్యంగా నవ్వుతూ అన్నారు స్వామి. అయితే “నేను వస్తాను, వస్తాను” అన్నారు తంబిగారు. ‘రావటానికి వీల్లేదు’ అన్నారు స్వామి. స్వామి మోటార్ సైకిల్ వేసుకొని వెళ్లి పోయారు. ఈ జోజప్ప గారు చక్కగా కాలువ ఒడ్డు మీదుగా వెళ్ళారు. స్వామి నిడమానూరు వెల్లేలోగా జోజప్ప గారు గుణదల చర్చిలో వున్నారు. ప్రార్ధన చేస్తున్నారు. ప్రార్ధన చేసిన తరువాత ‘ఏయ్! ఎప్పుడొచ్చావు?’ అని అడిగితే “నన్ను నీవు తీసుకు రాలేదు కదా. నేను దేవుని సహాయం వలన వచ్చాను” అన్నాడు జోజప్ప గారు. అప్పుడు అక్కడ Dangs స్వాముల వారు, ఆర్నాల్డ్ స్వామి, ఇంకా కొంత మంది పెద్దలున్నారు. వారు కూడా కల్దిరారో స్వామికి చెప్పారు. స్వామి ఒప్పుకున్నారు. మంచిది. మీరు మంచి పని చేశారు. దేవుని యొక్క ఆశీర్వాదం ఈయనలో వున్నది. అని ఆ నలుగురూ అనుకున్నారు.
మళ్ళీ ఒక పర్యాయము తంబిగారు
గుడివాడ వెళ్ళవలసి వచ్చింది. ఆ గుడివాడ పోవలసిన సమయంలో మొట్టమొదట ఈయన వైద్యం చేసిన కుష్టు రోగిని చూచి
వాటేసుకున్నాడు.
‘తండ్రీ! మీరు బయలు దేరి వచ్చారు. నన్ను ఆరోగ్య పరచారు. నేను ఒక పాపిని. ఈ పాపిని మీరు బాగు చేసినందుకు గాను
దేవునికి అనేక స్తోత్రములు చెల్లించు చున్నాను’ అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు తంబిగారు, “అది నా పని కాదు. పిత అయిన
దేవుడు
నీకు ఆయురారోగ్యములు ఇచ్చాడు. నీవు దేవుని మరువ కుండా ప్రార్ధన చెప్పుకో. నీ ఆత్మను దేవునికి ఒప్ప చెప్పు” అని చెప్పారు. అప్పుడు వారి కుటుంబానికి అంతటికి కూడా
గట్టి నమ్మకం కలిగింది. అప్పటినుండి
పగలు, రాత్రి ఈ జోజప్ప గారు చెప్పినట్లుగా
ప్రార్ధన చేస్తున్నారు. ఇప్పటికి
కూడా ఆ కుటుంబము మంచి కుటుంబముగా, జోజప్పగారు దీవించినట్లుగా వున్నది.
జోజప్ప గారు ఇక్కడ సుమారు పది,
పన్నెండు సంవత్సరాలు వున్నారు. వారి దగ్గర ఒక పుస్తకం వున్నది. ఈ పుస్తకాన్ని రోజూ కూడా పొరబడకుండా తీసుకు పోయేవారు. అది బైబిల్ గ్రంధమో ఏమో! వారి భాషలో వున్నది. సువిశేష ప్రభోద చేసేవారు. వాక్యం చక్కగా చెప్పే వారు. మాలగూడెం, మాదిగ గూడెం అను భేదం లేకుండా, సమస్త జాతులకు సువిశేషం బోధించే
వారు. అందరితో కలసి మెలసి వుండేవారు. ఒక చాప వేసుకొని అక్కడ కూర్చొనే వారు. తిరుకుటుంబ జపం చెప్పించే వారు. తర్వాత యేసు నాధస్వామి పాడిన పాటలను
గురించి, మరి ఫ్రాన్సిస్ వారి గురించి
కొంత కొంత చెప్పేవారు.
కల్దిరారో స్వామి, జోజప్ప గారు పైకి మాట్లాడుకునే వారే
కాని మనస్పూర్తిగా ఈ జోజప్ప గారి మీద నమ్మకం లేదు. అప్పటికి స్వామికి తెలియదు కదా. తెలియక అప్పుడప్పుడు కోప్పడే వాడు. “మీరు కోప పడినా నాకు కోపం రాదు. నాకు నవ్వు వస్తుంది. మీరు ఎన్ని అన్నా నాకు కుషియే” అనేవారు తంబిగారు. ‘ఏయ్! నిన్ను కొడతా... తుపాకితో పేలుస్తా ...’
అనేవారు స్వామి.
తంబిగారు నవ్వేవారు.
వారు ఇక మూడు నాలుగు రోజులకు
చచ్చి పోతారు అనగా విరోచనాలు కలిగాయి. అవి కలిగినపుడు ఎవరూ దగ్గరికి రాలేదు. సద్దాపు బాలస్వామి మరియు నేను ఇద్దరమే
ఉన్నాము. కల్దిరారో స్వామి వచ్చారప్పుడు. ‘ఏయ్! నీకు ఏం కావాలి ? ఇక్కడ ఉంచమంటావా, లేక అమెరికన్ హాస్పిటలుకి
పంపమంటావా?’ అని అడిగారు. “నాకు హాస్పిటలు అవసరం లేదు. నేను దేవుని రాజ్యమునకు వెళ్లి పోయేది
వుంది. ఇక నాకెందుకు హాస్పిటలు! నాకు అవసరం లేదు. నేను దేవుని రాజ్యమునకు వెళ్ళి పోయేది
వుంది. ఇక నాకు ఎందుకు హాస్పిటలు! నా కవసరం లేదు” అన్నారు తంబిగారు. ఇప్పుడు నీకు విరోచనాలు అవుతున్నాయి. అనేక భాదలు పడుతున్నావు. ఎవరు చేస్తారు? ఇక్కడ టీచర్లు వున్నారు కాని వారు ఆ
పనులు చేయరు. నీవు ఆసుపత్రికి వెళ్తే అక్కడ
నర్సులు చేస్తారు’ అన్నారు కల్దిరారో స్వామి. “నాకు ఏ ఉపకారము అవసరము లేదు. దైవ రాజ్యం
వెళ్ళిపోయేవాన్ని.
నాకు ఎందుకు” అన్నారు. కొంచెం సేపు గడచిన తర్వాత “ఇక నాకు టైంకూడా దగ్గర పడుతుంది. ఇక నాకవసరం లేదు” అన్నారు. అప్పుడు కల్దిరారో స్వామి నన్ను అడిగారు: ‘ఏం! జోజప్ప గారూ! ఈయనకు విరోచానాలు అవుతున్నాయి. ఎవరూ చూసే వాళ్ళు లేరు. అంతా అసహ్యించు కొంటారు. ఏదో, నా మాట తీసి వేయలేక వుంటారనుకో. అయినా వారి మనసుకు కష్టముగా వుంటుంది. మరి ఆసుపత్రికి పంపిద్దామంటే ఈయన ఒప్పుకోవడం
లేదు. మరి ఏం చేద్దాం? అని స్వామి ఆయన కూర్చుంటున్నారన్న మాట
వాస్తవమే. సరే! అవి నేను తీసేస్తాను అని చెప్పాను.
నాకు ఇష్టమే స్వామి! నేను చూస్తాను. వారు నేను తల్లీ బిడ్డ లాగ ఉన్నాము. ఇద్దరం చక్కగా ఉన్నాము. వారు విరోచానాలకి వెళ్ళుతున్నారు కాబట్టి
తీసి వేస్తాను అన్నాను. కల్దిరారో
స్వామి ఒక బొచ్చ ఇచ్చారు. ఆ బొచ్చలో
తంబి గారు ఉసిమి పోసి, మంచం
మీద పెట్టి చేసేవారు. తెల్లవారి
ప్రొద్దున ఆ చెరువులో పోసి వచ్చేవాళ్ళం. ఇట్లా చేస్తున్నాము.
నాల్గవ రోజున, జనవరి పదిహేనవ తారీఖున ఇక్కడ పాటల పూజ
జరుగుతుంది. జోసఫ్ తంబి గారు అలా వుండి కూడా, పూజకు కూడా రాకుండా బోయపాటి ఫ్రాన్సిస్
గారింటికి వెళ్ళిపోయారు. ప్రొద్దుననే
లేచి అక్కడికి వెళ్ళి పోయారు. అక్కడకు వెళ్ళిన తర్వాత సాయంత్రం మూడు గంటలపుడు “వెళ్లి పోతున్నాను” అన్నారు. వెళ్ళి పోతున్నాను అనేసరికే ఆత్మ జీవం
విడచింది. ఆయన చని పోయారు. బాలాస్వామి తండ్రిగారు, బోయపాటి ఫ్రాన్సిస్ వెంటనే ఇక్కడికి
కబురు చేశారు.
జోజప్ప గారు ఈ
విధముగా అయి పోయారు. కాబట్టి
మీరు త్వరగా రావాలి. అని
కబురు చేసాడు.
స్వామి నమ్మలేదు. ఇక్కనుండి ఒక మనిషిని అక్కడకి పంపించాడు
స్వామి నమ్మ లేకుండ. ఆ మనిషి
చూసేసరికి పండుకొని వున్నాడు. ఆత్మ వెళ్ళి పోయింది. ఇక అప్పుడు మేమందరమూ వెళ్లి ఒక మంచం మీద పండ పెట్టి, తీసుకువచ్చి ఇచట పండ బెట్టాము. రాత్రంతా ఇక్కడే వున్నాం. ప్రార్ధనలన్నీ
జరిగాయి. ఇక పద హారవ తారీఖున సాయంత్రము
నాలుగు గంటలపుడు స్వామి గారి భూస్థాపితం జరిగింది.
No comments:
Post a Comment