Saturday, April 25, 2020

సాక్ష్యం 38

సాక్ష్యం 38

దాసరి బాలస్వామి
అల్లాపురం

నా పేరు దాసరి బాలస్వామి. మా స్వగ్రామం అల్లాపురం. బ్రదర్ తంబి గారు ప్రజలతో బాగా కలిసిపోయి, యేసు ప్రభుని గూర్చి ప్రజలకు వచ్చీ రాని భాషలో చెప్పేవారు. జనానికి తంబి గారంటే చాలా అభిమానం ఉండేది. ఎందుకంటే, కొన్ని సేవలు కూడా చేసేవారు, మందుకాని, మోటు వైద్యం లాంటివి చేసే వారు. ఆ రోజులలో ఏమిటంటే, ప్రజలకు జబ్బు గాని వచ్చినట్లయితే ఏదో ఒక మందు ఇచ్చే వాడు. మరి ఏం ఇచ్చే వాడో, ఏం చేసే వాడో తెలియదు. ఆయన చేత ప్రార్ధన చేయించు కుంటే తగ్గేది. అదేకాకుండా బోయపాటి బాలస్వామి గారి తల్లి క్లారమ్మ గారికి మగ పిల్లలు లేరంటే పిల్లవాడిని ఇచ్చారని ప్రచారం అయింది.

ఇటు ప్రక్క కులం అనేది, హిందువులలో క్రైస్తవంలో లేదు అది వరకు. ఎందుకంటే సామాన్యముగా క్రైస్తవ మతం అంటే మాల, మాదిగలకు సంబందించిన ఒక విధమైన చిన్న చూపు ఉండేది. అందుచేత ఆయన వచ్చిన తరువాత అందరు దగ్గర చేరటం చూశాక. ఆయనపై ఓకే రకమైన గౌరవం కలిగింది. అతడు ఎవరి ఇంటిలోనైనా స్వతంత్రముగా వెళ్ళ గలిగే వారు. అందరు ఆయనను ఒక సన్యాసి క్రింద లెక్క పెట్టే వారు. ఆయన డ్రెస్ మాత్రం, సన్యాసి డ్రెస్ ఏమీ కాదు. లుంగీయునూ, తమిళులు మామూలుగా వాడే లాల్చీ వేసుకునే వారు. ఈ రెండు వేసుకొని వెళ్ళేవారు. ఒక్కోసారి సగం లాల్చీ అంటే మోచేతుల వరకు ఉండేది, అదే ధరించేవాడు. అందుచేత, ఆయనంటే మన ప్రాంతమున మంచి ఉద్దేశము వుంది. గడ్డం కూడా ఉన్నందున అభిమానం ఉండేది. ఆయన చాలా అద్భుత వ్యక్తి అని రకరకాలుగా చెబుతుండే వారు. అది నాకు తెలిసి వచ్చింది.

నేను కాలేజి చదువుకుంటూ బయటకి వెళ్ళాను. ఆ రోజుల్లో కాలేజిలు ఇక్కడెక్కడా లేవు. ఇంటర్మీడియట్ ఆంధ్రా యూనివర్సిటి వైజాగ్ లోను, B.A. మద్రాసులోనూ చేశాను. 1943లో తంబి గారు నాకు పరిచయం అయ్యారు. ఆయన ప్రతీ వారి దగ్గరకు వెళ్లి మాట్లాడే వారు. ఆయన ఎప్పుడూ మనుష్యులతో తిరిగి, ఇక్కడ ఉండే వాడు కాదు. అందరితో పనులు చేసే వాడు. కూలి పని కూడా చూసే వాడు. మనుష్యులతో బాగా కలిసి పోయే వాడు. ఆయన దగ్గరకు వెళ్లి పలుకరించటం; ఆయన వచ్చీ రాణి భాషలో మాట్లాడటం; తెలుగు అంత బాగా వచ్చేది కాదు. నాతో పెద్ద పరిచయం లేదు. ఇది మా సంఘం మా గుడి కాబట్టి, అందులోనూ స్వాముల వార్లు ఇక్కడే వుండేవారు కాబట్టి వచ్చీ పోతూ వుండే వాళ్ళం. ఆదివారం గాని, శుక్రవారం గాని, వచ్చే వాళ్ళం. అప్పుడు పూజకు వచ్చినప్పుడు, తంబిగారిని చూసాను. ఈయన గురించి ప్రజలు చాలా బాగా చెప్పుకునే వారు. ఒక శుక్రవారం నేను ఇక్కడకు వచ్చినప్పుడు ప్రజలు ఏం చెప్పారంటేఈయనకు శుక్రవారం నాడు గాయలొస్తాయి, కాళ్ళకు, చేతులకు, ప్రక్కలోను, పంచ గాయాలు వస్తాయి అని చెప్పారు. చూడాలన్న కోరికి పుట్టింది. చదువు కొన్న వాడిని గదా! కొంత గర్వం ఉండేది. ఉద్దేశ పూర్వకముగా పరీక్ష చేయాలి, చూద్దాం పరీక్ష చేద్దాం అని గాని, అంత ప్రేమ వుంది కాదు. నేను చూచుటకు వచ్చినపుడు, ఇక్కడే మూలలో (ఆయన గదిలో) కూర్చొని ఉన్నాడు. చేతులకు గుడ్డలు కట్టారు. కళ్ళకు కూడ కట్టారు. ప్రక్కమ్మటి కూడా, ఈ అయిదు ప్రదేశాల నుండి రక్తం కారుతూ వుంది. నేను దీనిని అద్భుతంగా ఆట్రిబ్యుట్ చేయలేదు. చేయకనే ఇదేదో శారీరక శాస్త్రం, ఎదో అయి ఉంటుంది అని అనుకున్నాను. ఆ తర్వాత అది చూశాను.

రెండవది ఏమిటంటే, ఆయన గుడికి వచ్చిన తరువాత ఆ మూలలో వుండేవారు. ఒకతను తన పుండు బాగు చేస్తాడని తంబిగారి దగ్గరికి వచ్చాడు. అతనికి మోకాలి దగ్గర పెద్ద పుండు వుంది. చీము కారుతూ వుంది, రసి కారుతుంది. చూచుటకు చాలా అసహ్యంగా వుంది. అక్కడ ఎవరూ లేరు. ఇతడు ఏం చేస్తాడని నేను పరీక్షించ గోరితిని. ఆయనను పరీక్షించే పద్ధతి గాని, ఆయన మీద అభిమానంతో కాదు. సరే నేను వెళ్లి అక్కడ ప్రక్కనే నిలుచుండే సరికి ఆయన వచ్చి ఆ వ్యక్తిని మూలకు తీసుకు వెళ్ళాడు. అచటకు తీసుకువెళ్ళి, నాకుట ప్రారంభించాడు. నేను వెంటనే అతన్ని ఎదురించాను. కాస్తా నాలుగు ఇంగ్లీషు ముక్కలు వస్తాయి కదా! ‘ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏంటండి ఇది! అసహ్యముగా చేస్తున్నారు. ఆ జబ్బు నీకు తగులు కుంటుంది, ఇవేం పనులు? అన్నీ అసహ్యపు పనులు చేస్తున్నావు ఏంటి? ఇది మంచిది కాదు’ అని అన్నాను. ఆయన నవ్వారు. ఆయన నవ్వుతున్నా గాని, ‘నాక్కూడా మంత్రం వేస్తున్నావా?’ అన్నాను. ఆయన ఏమీ అనలేదు. అది జరిగిన రెండవ రోజున ఆ వ్యక్తి తంబిగారి కోసం వచ్చాడు. పుండు శుబ్రంగా తగ్గి పోయింది. నేను ఖచ్చితంగా చూశాను. పంచ గాయాల గురించి, నేను అవిటో స్వామి గారి చేత పుస్తకం వ్రాయించాను.

ఒక నాడు ఒక వ్యక్తి అల్లాపురం నుండి ఇక్కడికి వచ్చాడు. వాడికి ఏమీ లేదు. అడుక్కుంటాడు. వాడి భార్య కూడా పని చెయ్యదు. వారికి ఐదారుగురు పిల్లలున్నారు. ఆ రోజుల్లో కూలి చేసుకుని బ్రతికే వారు. అతను ఇక్కడ గుడికి వచ్చాడు. ఆడుకోడానికి కాబోలు వచ్చి ఉంటాడు. అంతకు ముందు రోజు బ్రదర్ జోసఫ్ తంబి గారికి, ఒక క్రొత్త అంగీ మరియు క్రొత్త లుంగీ ఎవరో పెట్టారు. అది వేసుకుని సత్ప్రసాదానికి వెళ్ళడం నేను చూసాను. నేను సత్ప్రసాదం తీసుకుని కాసేపు వుండి వెళ్ళిపోయాను. రెండవ రోజు మళ్ళీ వచ్చారు. ఆ రోజు సాయంత్రమే మా ఊరి వ్యక్తి దగ్గర ఆ గుడ్డలు వున్నాయి. ‘ఎవరిచ్చారండీఅంటేనాకు ఆ స్వాముల వారు ఇచ్చారుఅన్నాడు. ఎవరు? ఆ తెల్ల టాయానా? అని నేను అడుగగా తెల్లటాయన కాదు. ఆ నల్ల గడ్డమున్న స్వామి.. ఆ సాధువు గారు ఇచ్చారు అన్నారు. నేను తంబి గారి దగ్గరకు వచ్చి జనాన్ని ఆకర్షించు కోడానికి యాక్షన్ చేస్తున్నావా? అని చెప్పే సరికి ఆయన నవ్వారు. ‘ఏం నవ్వుతావేంటి, జవాబు చెప్పు,’ అన్నాను. అప్పుడాయన నా తలపై సిలువ గురుతు వేసి, “నీవు చాలా గర్విష్టుడివి. నువ్వు చాలా తల బిరుసు వాడివి. వస్తావు, నా కోసం వస్తావుగా అన్నారు. ఆ ఇవన్నీ మాయ మాటలలే అన్నాను. ఆ తర్వాత నేను కాలేజికి వెళ్ళిపోయాను. జనవరి మూడవ తారీఖున మా కాలేజి. ఆ తర్వాత నేను కాలేజికి వెళ్ళి పోయాను. జనవరి మూడవ తారీఖున మా కాలేజి. ఆ తరువాత పదిహేనవ తారీఖున వారు చని పోయారని తెలిసింది.

నేనెప్పుడు కూడా ఆయనను విమర్శించటమే. ఆ తరువాత ఆయన మీద గౌరవం కలిగింది. నేను కాలేజికి వెళ్ళిన తర్వాత ఆయన మీద అభిమానం కలిగింది. అంతకు ముందు ఫ్రాన్సిస్ గారంటే శౌరి వారు అని మాత్రం తెలుసు. నేను మద్రాసు లోయోలా కాలేజికి వెళ్ళినప్పుడు, అసిస్సీపుర ఫ్రాన్సిస్ ఒకరున్నారు అని, అతనికి పంచ గాయాలున్నాయని, ఇవన్నీ ఇప్పుడు తెలిసింది. 1944-1946 వరకు నేను మద్రాసులో వున్నాను. పంచ గాయాలను చూశాను. నేను ఇది చూద్దామని శుక్రవారమే వచ్చాను. శుక్రవారం వస్తే చూస్తారని, వాళ్ళు వెళ్ళు అంటుంటేను వచ్చాను, వచ్చి చూసాను. ఆ గుడ్డలను తీయనీయ లేదు. ఆయన చనిపోయిన తర్వాతనే ఆయన మీద అభిమానం పెరిగింది. బ్రతికి ఉన్నప్పుడు నేను ఆయన విమర్శకుడిని. పంచ గాయాలు చూసి, అనారోగ్య కారణాలు ఏమన్నా వున్నాయేమో అని అనుమానించాను. Now after knowing all these things, ఇప్పుడు కాదు 1944 నుండి తెలుసుకున్నాక, నేను గనక ఆ రోజుల్లో అయిపోయి నట్లయితే, i would be the first capuchin priest in A.P. నేను అవలేదు. దేవుడు నన్ను ఆ ఫాదర్ ని చేయకుండా, ఆరుగురు పిల్లలకు ఫాదర్ ని చేసాడు. I wanted to become a priest at that time.


No comments:

Post a Comment