Sunday, April 26, 2020

సాక్ష్యం 36

సాక్ష్యం 36

నాగదేశి ఆరోగ్యమ్మ
అవుటపల్లి

తంబీ గారూ! స్తోత్రం. మీరు నన్ను దీవించి యున్నారు. నా పేరు ఆరోగ్యమ్మ. వడ్లు కొనుక్కొచ్చి పెట్టమన్నారు. తెచ్చి వారికి ఇచ్చాను, కుండల్లో పోసి నెత్తు లేసాను. పెసర్లు కూడా కొనుక్కొచ్చి కుండల్లో పోసి నెత్తు లేసాను. ఒకరోజు శుక్రవారం నేను గుడిలోకి వచ్చి, గుడి అయిపోయాక వారి వెంబడి పోయి, “స్వామీ! మరి డబ్బులుఅన్నాను. నాకేమో తెలవదు, అది శుక్రవారం అనీ! నేను అడిగే సరికి వెనక్కు తిరిగి చూసారు. ‘జోజప్ప స్వామీ! ఏమన్నా డబ్బులిస్తారా స్వామీఅని అడిగాను. అంటేనూ, గబాలున లోనికి వెళ్లి, కుండ తీసుకు వచ్చి ఎత్తేసారు. పెసర్లు కుండ పగిలి పోయింది నా ముందే. ఇంతే! ఇక గడగడ వణుక్కుంటూ వెళ్తే, నాతో పాటు గుడికి వచ్చిన వాళ్ళు, ‘ఈ రోజు శుక్రవారం కదా! ఎందుకు నువ్వు వెళ్ళినావు?’ అని అన్నారు. నాకు తెలవదండీ. నా తప్పులు క్షమించండి అన్నాను. ఇది నా పెళ్లి అయిన తరువాత జరిగిన విషయం. ఇక ఇంటికి వెళ్ళి పోయాను. ఇంటికి వెళ్ళి పోయిన తర్వాత, తెల్లారి ప్రొద్దున్నే డబ్బులు తీసుకువచ్చి, “ఆరోగ్యమ్మ గారూ! ఆరోగ్యమ్మ గారూ! బయటకు రండిఅని పిలిచారు. నాకు భయమేసి రాలేదు. “నువ్వు రా బయటకిఅన్నారు. ‘తప్పు చేశాను స్వామి! నన్ను క్షమించండి, నన్ను మన్నించండి స్వామీఅని క్షమాపణ అడిగాను. “భాద పడవద్దు, ఏ కష్టా లొచ్చినా, ఏ భాదలు వచ్చినా నన్ను తలంచుకో నీవు. భాద వద్దు. నీకేం కష్టాలొద్దుఅని చెప్పారు. అటువంటి మనిషి ఆయన.

నాగదేశి ఆరోగ్యమ్మ, అవుటపల్లి

No comments:

Post a Comment