పేరు : కలపాల మరియమ్మ
వయస్సు : 75 స.లు
గ్రామం : తేలప్రోలు, ఉంగుటూరు మండలం, కృష్ణా
జిల్లా, ఆంధ్రప్రదేశ్
నా పేరు కలపాల మరియమ్మ. నాకు 7 సం.లు వయస్సు ఉండగా, జోసఫ్ తంబిగారు తేలప్రోలు వచ్చారు. బజారు, బజారు తిరిగి పిల్లలను తంబిగారు పిలుస్తుంటే
నేను కూడా వారితో కలిసి వెళ్లాను. పిల్లలందరూ గుడిలో జపమాల చెప్పుతుండగా, తంబిగారు గుడి గుమ్మము దగ్గర కూర్చొని
జపమాల చెప్పేవారు.
తరువాత తంబి గారితో
నేను కొద్ది సేపు అడుకొనే దానిని.
తపస్సు కాలంలో స్లీవమార్గం జరుగు
తుండగా, తంబిగారు ప్రారంభం నుండి చివరి
వరకు మోకాళ్ళ మీద ఉండేవారు. అప్పుడు వారికి పంచ గాయాలు వచ్చి సొమ్మసిల్లి పడిపోయే వారు. దేవరపల్లి కృపావల్లి గారు వచ్చి పంచ
గాయములను తుడుస్తూ వుంటే, “వద్దు
వద్దు. నన్ను అంటుకోవద్దు” అని అన్నారు. ఒక రోజున, తేలప్రోలు గుడి దగ్గర పాము ముళ్ళు తంబిగారికి గుచ్చుకుంది, కాలు వాసి లావు అయింది, వెంటనే ఎడ్ల బండి మీద పెద్దవుటపల్లి
పంపించారు.
ప్రతీ నెల మొదటి ఆదివారము కృపావల్లి, కత్తిరేనమ్మ, సంతోషమ్మ అనే సభ తల్లుల వెంట మేము అవుటపల్లి
వెళితే, మాకు తంబి గారు అన్నము పెట్టేవారు, పండ్లు ఇచ్చేవారు, తల మీద చేతులు వేసి ఆశీర్వదించే వారు.
తంబి గారు చనిపోయిన తరువాత 8 మందికి సంతానం లేకపోతే, 9 వారాలు తంబిగారి సమాధి వద్దకు తీసుకొని వెళ్లాను. వారందరికీ సంతానం కలిగింది.
నా కుమార్తె, మోక్షభాగ్యం కుటుంబంలో
కలతలు రాగా 4 నెలలు ప్రార్ధన చేసాను. ఆ తరువాత వారు ఒక్కటైనారు.
కలపాల మరియమ్మ, తేలప్రోలు
4 జూన్ 2009
కలపాల మరియమ్మ |
No comments:
Post a Comment