సాక్ష్యం 5
పేరు : చౌటపల్లి జ్వాన్నేసు
వయస్సు : 80
సం.లు
గ్రామము : తేలప్రోలు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా,
ఆంధ్రప్రదేశ్
నాకు 17 సం.ల వయస్సులో
తంబి గారు మా గ్రామము అయిన, తేలప్రోలు వచ్చి చిన్న పిల్లలకు ప్రార్ధనలు
నేర్పించేవారు. మా గ్రామంలో రెండు వర్గముల మధ్య పెద్ద పోట్లాటలు వచ్చాయి. మా పెద్దలు
పెద్దవుటపల్లి విచారణ గురువు కల్దిరారో స్వామి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు స్వామి అచ్చట
లేరు. చాలా ఆలస్యంగా వచ్చారు. ఈ మధ్య కాలంలో తంబి గారు మా దగ్గరకు
వచ్చారు. అన్నం తిందురుగాని రండి అన్నారు. పిడతలో వండిన
కొద్ది అన్నమును అది ఒక్కరికే సరి పోతుంది. కాని తంబి గారు 9 మందికి సంపూర్తిగా
భోజనం వడ్డించారు. ఈ అద్భుత విషయమును పెద్దలు చుట్టు ప్రక్కల వారి అందరికి
చెప్పారు. అనారోగ్యముతో ఉన్నవారికి కొన్ని చెట్ల ఆకుల పసరతో బాగు చేసెడి
వారు, అని పెద్దలు చెప్పేవారు.
చౌటపల్లి జ్వాన్నేసు, తేలప్రోలు
4 జూన్ 2009
చౌటపల్లి జ్వాన్నేసు |
No comments:
Post a Comment