Sunday, May 24, 2020

సాక్ష్యం 8

సాక్ష్యం 8

దయాల మరియమ్మ
వట్లూరు, ఏలూరు, పశ్చిమ గోదారి జిల్లా, ఆంధప్రదేశ్
74 సంవత్సరాలు

నా మేరు దయాల మరియమ్మ. వట్లూరు విచారణ జార్జ్ ఫాదర్ గారు అవుటపల్లికి వచ్చారు. తంబిగారు,వట్లూరు చూడాలిఅని అంటే, జార్జ్ ఫాదర్ గారు,మోటర్ సైకిల్ మీద నేను తీసుకు వెళ్తానుఅని అన్నారట. అప్పుడు తంబిగారు,మీ వెనకాల నేను కూర్చో లేను, మీరు వెళ్ళండి. నేను వస్తానుఅన్నారట. అయితే, వెమ్మటే తంబిగారు వట్లూరు వచ్చేసారు. వెనుక ఫాదర్ గారు వచ్చారు. ఒక బస్సు గాని, బండి గాని అప్పుడు లేవంట. స్వామి రాకముందే తంబిగారు వెళ్ళి వరండాలో కూర్చున్నారట. ‘బస్సు లేదు, బండి లేదు, ఎట్లా వచ్చారు’ అని ఆయన భయపడిపోయారు. తంబిగారు ఇక్కడకు వచ్చే వరకు కూడా వరండా తలుపు తీయలేదు. దొడ్లో నుంచి అటువైపు వెళ్ళిపోయి, తలుపు తీసారు.

తంబి గారు ఇక్కడికి వచ్చినపుడు, ఒకరోజు నేను గుడికి వెళ్ళాను. ఆ రోజు జార్జ్ స్వాములవారు, లాజరు మాష్టారును పిలచి, ‘మరి ఆ బ్రదర్ గారు, నాతో వస్తానంటే, నేను వెనుక కూర్చో మన్నాను ఆయన నేను కూర్చోను, నేను వస్తాను, మీరు వెళ్ళండి అని అన్నారు తంబిగారు. బస్సుగాని, బండిగాని లేవు. మరి నా కంటే ముందు వచ్చి, వరండాలో కూర్చున్నారు. నాకు భయంగా వుంది. బడిలోకి వెళ్లి కూర్చోమనండిఅని చెప్పారు. అప్పుడు లాజరు పంతులు గారు, తంబిగారితో, ‘బ్రదర్ గారు! ఫాదర్ గారు మిమ్ములను బడిలో కెళ్ళి కూర్చో మంటున్నారు,’ అని చెప్పారు. అందుకు తంబిగారు,ఎందుకు వెళ్ళాలి. నేను ఫాదరుకి చెప్పే వచ్చాను కదా! నేను ఇక్కడే, వరండాలోనే కూర్చుంటానుఅని చెప్పారు. సర్లే! అని ఊరుకున్నారు. అపుడు నా వయస్సు 12 సం.లు.

అప్పుడు నేను అబ్రహాము మాష్టారు ఇంటికి వెళ్ళాను. టీచర్ గారు మంచం మీద కూర్చొని ఉన్నారు. బ్రదర్ గారు అక్కడికి వచ్చారు. స్తోత్రం, కూర్చోండి, అని మంచం, జరిపితేసర్లే కూర్చోండమ్మా! ఏంటి గర్భిణీనా?” అన్నారు తంబిగారు. ఆవిడ అవునండిఅంది. తంబిగారు, పిల్లలు ఎంతమందిఅని అడుగగా,ఇద్దరు ఆడ పిల్లలుఅని వారు చెప్పారు. తంబిగారు, మగ పిల్లలు లేరా?” అంటే వారు లేరుఅని చెప్పారు. తంబిగారు, మగ పిల్లలు కావాలా?” అంటే, ఆమె దేవుడిస్తే కావాలి స్వామిఅని సమాధానం చెప్పింది. అప్పుడు తంబిగారు రెండు చేతులు పైకి ఎత్తి ప్రార్ధన చేశారు. తరువాత,అమ్మా! నీ గర్భాన మగ పిల్లవాడు పుడతాడు. ఫ్రాన్సిస్ అని పేరు పెట్టుఅని అన్నారు. తంబిగారు చెప్పినట్లుగానే, వారికి మగ పిల్లవాడు పుట్టాడు. ఫ్రాన్సిస్ అని పేరు పెట్టారు. ఆయన కోటీశ్వరులు అయ్యారు.

ఇంకొక రోజు బ్రదరు గారు మా వీధికి వచ్చారు. ఆ వీధిలో కొంత మందిని దగ్గర కూర్చో బెట్టుకొని శాస్త్రం చెబుతున్న ఒక వ్యక్తిని చూసిఏం చెబుతున్నావు?” అని తంబి గారు అడిగారు. ఆ వ్యక్తి ఏవో శాస్త్రం చెబుతున్నానండి. వీళ్ళందరు ఏదో శాస్త్రం చెప్పమంటుంటే చెపుతున్నాఅన్నాడు. తంబిగారు,ఏం శాస్త్రం చెబుతున్నావు? నాలుక చూపించుఅన్నారు. ఆ వ్యక్తి, అబ్బే ఫరవాలేదండి, మంచిగానే వుంది. నాలుకను ఎందుకు చూపించాలిఅంటే,చూపించుఅన్నారు తంబిగారు. అతడు చూపించాడు. బ్రదర్ గారు నాలుక మీద స్లీవ గుర్తు వేశాడు. అప్పటినుండి ఆ వ్యక్తి చనిపోయే దాకా మాట కూడా సరిగ్గా రాలేదు. నత్తి నత్తిగా మాట్లాడేవాడు. సిలువ వేశాడు కదా ఇంగ్లీష్ శాస్త్రాలు చెపుతున్నాడని.

రెండవ రోజు సాయంత్రం తంబిగారు నేను కొంతమంది కలిసి విచారణలోని అన్ని ఇల్లు సందర్శించాము. అప్పడు గుజ్జుల జ్వానేసు అనే అతను రామాయణం కథ అందరికీ చెబుతున్నాడు. ఆయన వారిలో కొందరికి రామాయణంలో తప్పులు చెబుతున్నాడు. అప్పుడు ప్రజలు తంబిగారిని చూసారు. అందరు వెళ్లి పొయారు, కాని జ్వానేసు మాత్రం వెళ్ళలేదు. అప్పుడు తంబిగారు జ్వానేసు నోరు తెరువమని నాలుకపై సిలువ గురుతు వేసారు. వెంటనే జ్వానేసు మాట్లాడటం మానేశాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ కుటుంబం మొత్తం పూజకు వచ్చి బ్రదర్ జోసఫ్ తంబిగారిని మాట దయ చేయమని వేడుకున్నారు. మరల తంబిగారు నోరు తెరచి సిలువ గురుతు వేశారు. వెంటనే అతను మాట్లాడటం జరిగింది.

మూడవ రోజు, అది శుక్రవారం రోజు. నేను ఆడుకుంటున్నాను. తంబిగారు వచ్చి,పాపా! పాపా! ఇక్కడ కొట్లు ఏమైనా ఉన్నాయా?” అని అడిగారు. నేను,ఉన్నాయండిఅన్నాను. ఆయన, ఏమేమి కొట్లు ఉన్నాయి?” అని మళ్ళీ అడిగారు. అందుకు నేను, జబ్బుల సాయిబూ, తాత సాయిబూ, చోటీ సాయిబూఅన్నాను. అప్పుడు తంబిగారు, అంటే ఏంటి? ఏం కొట్లు మళ్ళీ ఒక సారి చెప్పుఅన్నారు. మరల నేను, జబ్బుల సాయిబూ, తాత సాయిబూ, చీటీ సాయిబూఅన్నాను. తంబిగారు,మరి దోసకాయలు ఉంటాయా?” అని అడిగారు. నేను,ఉంటాయండిఅన్నాను. తంబిగారు, సరే! ఇక్కడ నిల్చో, నేను వస్తాను,” అని చెప్పి వరండాలోకి వెళ్లి రెండు అణాలు తెచ్చారు. నాతో, దోసకాయలు తీసుకురాఅన్నారు. తీసుకు వస్తానని వెళ్తున్నా. కొంత దూరం వెళ్ళాకపాపా! పాపా! ఇలా రాఅన్నారు, వచ్చాను. వస్తే ఎదో పిండి లాంటిది పెట్టారు. నాతో తింటూ వెళ్ళు. తినుకుంటా, వచ్చే వరకు నీకు సరిపోతుందిఅని అన్నారు. నాకు అది తింటానికి భయమేసి, గుడి ప్రక్కన నిలబడి పారబోయటానికి చూస్తున్నా. ఈలోగా వరండాలో నుండి వచ్చేసాడు. నాతో ఏం పాపా! ఇక్కడ నిలబడ్డావు?” అంటేఊరకనే నిలబడ్డానండీఅన్నాను. మరల లేదు, ఆ పిండిని పారబోయటానికి నిలబడ్డావు, దగ్గరికి రాఅని అది నా నోట్లో పోశారు. అది ఊరకనే అయిపొయింది. చాల రుచిగా వుంది. తరువాత, పెట్టండి ఇంకాస్త, తినుకుంటూ వెళ్తాను.’ అంటేఅబ్బో! ముందే చెప్పాను, తినుకుంటా వెళ్లి, తినుకుంటా రమ్మని, కాని దానిని  పారబోయటానికి ఇక్కడ నిలబడ్డావు, ఇక లేదుఅన్నారు. అంటే వెళ్ళిపోయాను. వెళ్లి, దోసకాయలు, పచ్చివి లావుగా వున్నాయి. పచ్చగా వున్నాయి. తీసుకొచ్చాను. తీసుకోస్తే వరండాలోనేఇక్కడ పెట్టుఅన్నారు. అక్కడ పెట్టాను. తర్వాత ఇకవెళ్లిపోతానండిఅంటే వెళ్ళమన్నారు. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ పిలిచారు. పిలిస్తే ఇందాకే చెప్పొచ్చు కదండి, ఇప్పటికే రెండు సార్లు ఇంత దూరం వచ్చాకే పిలుస్తున్నారు. అన్నాను. అప్పుడు తంబిగారు, సరే! రా ఇప్పుడే వెళ్ళుదువు గానిఅన్నారు. వచ్చాను. ఒక దోసకాయ రెండు బాగాలు చేశారు. గుజ్జు అయిపోయింది. ఓకే భాగం, అక్కడ పెట్టుకున్నారు. ఒక భాగం నాకు ఇచ్చారు. ఆయన తీసుకోఅన్నారు. నేను ఏంటండి! నేను ఇంత గట్టివి తీసుకు వస్తే, ఇంత మెత్తగా అయిందేమిటిఅంటేఅట్లాగే ఉంటుందిలే, తినకుంటూ వెళ్ళిపోఅన్నాడు. అక్కడే తిన్నాను తిన్న తరువాతసరే! వస్తానండి, అని ఆయన వైపు చూశాను.  ఆయన నొసటి భాగాన, చెమట గుజ్జు గుజ్జుగా ఎర్రగా వుంది. ఎర్ర నీళ్ళు వచ్చాయి. అప్పుడు నేను మీకు ఎర్ర నీళ్ళు వచ్చాయండిఅంటేఅట్లాగే వస్తుంది. నీవు వెళ్ళిపోఅన్నారు. నేను వచ్చేసాను.

వట్లూరులో నాలుగు రోజులు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు వట్లూరుకు ఒకే సారి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను ఇక్కడ చెరువు ఉన్నదా?” అని అడిగారు. నేను ఉన్నది అని చెప్పాను. ఆయనఎక్కడ వుంది. చూపించుఅన్నారు. ఆయన వెనకాలే వెళ్లి చెరువు చూపించాను. చెరువు గట్టుఎక్కినప్పుడు స్టేషన్ కనబడింది. ఆయన అదేమిటిఅంటేస్టేషన్అన్నాను. ఆయనచూద్దాం పదాఅన్నారు. చూసి తిరిగి వచ్చాము. వచ్చిన తర్వాత ఆయన అసలు కనిపించలేదు. ఇద్దరం వెనకా ముందు వెళుతూనే ఉన్నాము. ఇక కనిపించలేదు.

దయాల మరియమ్మ, వట్లూరు

దయాల మరియమ్మ

No comments:

Post a Comment