సాక్ష్యం 9
పేరు : కైలే వెంకటరత్నం
వయస్సు : 75 సం.లు
వృత్తి : రిటైర్డ్ టీచర్
అడ్రస్ : కైలే ఇమ్మనియేలు
పెద్దావుటపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
1944 ఏప్రిల్ నెలలో తంబి గారు, మా కృష్ణాపురం గ్రామానికి సాయంత్రం 3-4 గంటల సమయంలో వచ్చారు. ఆయన ముందు ఒక కుర్చీ వేసారు గుడి దగ్గర. ఎందుకంటే ప్రజలకు తంబి గారు అంతకు ముందే
తెలుసు గనుక. అందరితో పాటు నేను కూడా తంబిగారిని
చూడాలని వెళ్లాను.
ఆయన ప్రార్ధన ద్వారా
వ్యాధి బాధలు నయం చేయడం, పంచ
గాయాలు పొందడం నేను విన్నాను. అప్పుడు నాకు 14 సం.ల
వయస్సు. తంబి గారు నన్ను ఒక గ్లాసు మజ్జిగ
అడిగారు. నేను వెళ్లి మా అమ్మకు చెప్పగానే, అప్పుడు మా అమ్మ ఒక గ్లాసులో మజ్జిగ
అలాగే వేరుశనగలు కొంచెం ఇచ్చింది. అవి తెచ్చి తంబిగారికి ఇచ్చాను. అవి తిని త్రాగిన తర్వాత, తంబి గారు మాకు ప్రార్ధన యొక్క గొప్పతనం, దానధర్మములు యొక్క ప్రాముఖ్యత గురించి
వివరించారు. ఎక్కువగా ప్రార్ధనలు చేసేవారు, అలాగే ప్రార్ధనలు నేర్పించారు.
ఆ తర్వాత నేను మళ్ళీ తంబిగారిని
చూడలేదు కాని,
15/01/1945న చనిపోయారని
మాత్రం విన్నాను.
ఇది నా యొక్క అనుభవము.
కైలే వెంకటరత్నం, కృష్ణాపురం
కైలే వెంకటరత్నం |
No comments:
Post a Comment