సాక్ష్యం 10
పేరు : తుల్లిమిల్లి రాయప్ప
వయస్సు : 01/01/1930
వృత్తి : రిటైర్డ్ టీచర్
అడ్రస్ : తేలప్రోలు గ్రామము, పోస్ట్, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
వివాహానికి ముందు నా తల్లి గారైన
తుల్లిమిల్లి మరియమ్మ హిందువుగా జీవించేవారు. వివాహములో మా అమ్మ జ్ఞానస్నానము ద్వారా
కతోలిక శ్రీసభలో చేరారు. నేను
పుట్టక ముందు ముగ్గురు మగ బిడ్డలు పుట్టి చనిపోయారట. అప్పుడు మా అమ్మ ఓక తాడు [రక్షాతాడు]
ఎప్పుడూ చేతికి కట్టుకొని తిరిగేది. అదే సమయంలో బ్రదర్ జోసెఫ్ తంబి గారు మా ఇంటి మీదుగా బజారులో నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. ఆయన మా అమ్మ గారిని పిలిచారు. వెంటనే మీ ఇంట్లో దెయ్యము సంచరించు చున్నది
అని చెప్పారు.
అప్పడు మా అమ్మ
ఆ రక్షాతాడుని ఒక మట్టి కుండ ప్రక్కన పడేసింది. వెంటనే తంబిగారు మా ఇంటి లోపలకి వెళ్లి
తిన్నగా ఆ కుండ దగ్గరకు వెళ్లి ఒక తాడు పైకి తీసారు. ఎందుకు నీవు ఈ రాక్షత్రాడు ఇంటి లోపలకి
తెచ్చావు, అదే ఒక దయ్యం అని చెప్పారు. అప్పుడు మా అమ్మగారు పిల్లల గురించి చెప్పారు. వెంటనే ఇంటిలో వున్న చిన్న పిల్లవాడు
అతని పేరు ఆరోగ్యం అతని అస్వస్థతగా ఉన్నట్లు కడుపు నొప్పితో భాద పడుతున్నట్లు, విరోచనం అవక, పాసుకి వెళ్లక చాలా బాధ పడుతున్నాడు
అని తంబి గారికి చెప్పగా, తంబిగారు ప్రార్ధన చేసి, అతని పొట్టపై చేయివేసి రుద్ది సిలువ
గుర్తు వేశారు వెంటనే బాబు మంచి ఆరోగ్యంతో వున్నాడు. అతను ఇప్పుడు గొప్ప స్థితిలో వున్నాడు.
చిక్కవరం అనే గ్రామం నుంచి ఒక
చౌదరిగారు చేయికి పెద్ద వ్రణముతో వుండేవారు. ఆ సమయంలో అదే గ్రామం నుంచి R.C.M. స్కూల్ హెడ్ మాష్టారు జోజప్ప గారు పని
చేయుచున్నారు.
ఆ చౌదరి గారికి
హెడ్ మాష్టారు బ్రదర్ జోసఫ్ తంబి గారిని కలుసుకోమని సలహా ఇచ్చారు. ఆయన అవుటపల్లి వచ్చి
విచారించగా, తంబి గారు ఆయనతో, “నీవు క్రీస్తును విశ్వసిస్తున్నావా?” అని అడిగారు. అప్పుడు అతను, ‘నేను విశ్వసిస్తున్నాను’
అని చెప్పారు.
అప్పుడు తంబిగారు,
“నీ చేయి చూపించు” అని చెప్పగా ఆ చేయి పై ఏవో ఆకులు తీసుకువచ్చి కట్టుకట్టి, “ఈ కట్టు మూడు రోజులు పాటు ఊడదీయ కూడదు;
అలాగే వుంచి మరలా మూడవ రోజు ఇక్కడకు రావాలి” అని చెప్పారు. మూడు రోజులు తర్వాత ఆయన అవుటపల్లి వచ్చారు. ఈయన కట్టు విప్పేసరికి అద్భుతం, గాయం పూర్తిగా మాని పోయింది. ఈ వ్యక్తి జ్ఞానస్నానం తీసుకోలేదు, కాని
ఈయన తలంపు నందు దేవుడు వున్నాడు, అని చెప్పారు. కొంత
కాలానికి తంబిగారు మరణించగా ఆయన ఏడ్చుకుంటూ, ఆరోజే ఈ సాక్ష్యం చెప్పారు.
తంబి గారికి పంచ గాయలు రావటం
నేను చూసాను. నేను ఆయనను మంచంపై పరుండ బెట్టుటకు
సహాయం చేసేవాడిని.
తుల్లిమిల్లి రాయప్ప, తేలప్రోలు
13 జులై 2009
తుల్లిమిల్లి రాయప్ప |
No comments:
Post a Comment