Thursday, May 21, 2020

సాక్ష్యం 11

సాక్ష్యం 11

పేరు             :         వనమాల జోసఫ్
S/O             :         రంగయ్య
వయస్సు        :         63 సం.లు
అడ్రస్           :         కోడూరుపాడు, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా, 521 110, ఆంధ్రప్రదేశ్

అప్పుడు నా వయస్సు 10 సం.లు. కోడూరుపాడు సంఘ పెద్దలు 1. రెంటపల్లి శాంతయ్య, 2. దాసరి దేవ సహాయం, 3. వేమూరి శౌరయ్య, 4. పొనుగుమాటి మద్ది రామయ్య, 5. కొండ్రు ముసలయ్య అను వారలు మాట్లాడుకుంటూ బ్రదర్ జోసఫ్ తంబి గారి విషయములు చర్చించుకొనే సమయమున ఆయనకు వచ్చినటువంటి పంచ గాయాల గురించి నేను విన్నాను. అప్పుడు హిందువుగా వున్న నేను తంబి గారి ప్రార్ధన కొరకు క్రైస్తవుడుగా మారాలని నిశ్చయించుకొని, కతోలిక క్రైస్తవునిగా జ్ఞానస్నానం తీసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకు కతోలిక ఉపాధ్యాయ, ఉపదేశిగాను వీరవల్లి కతోలిక సంఘంలో ప్రార్ధనలు చేస్తున్నాను.

నా చిన్న కుమార్తె పేరు వనమాల సమతా. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ నివాసియైన కర్రె సుదీర్ కుమారుకు ఇచ్చి వివాహం చేయటం జరిగింది. ఆమెకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టినది. తరువాత రెండవ కాన్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బిడ్డ కొద్దిగా అనామకంగా వుంటుంది. భర్త ఆమెను నానా ఇబ్బందులు పెడుతూ, ‘నీకు మగ పిల్లవాడు పుడితేనే మరల నా దగ్గరకు వస్తావు’ అని ఆమెను భయపెట్టాడు. ఆ పరిస్థితిలో, నేను, మా కుటుంబం, జోసఫ్ తంబి గారి సమాధి వద్దకు వెళ్లి తంబిగారికి  ప్రార్ధన చేసుకున్నాం. ఆ తరువాత ఆమెకు గర్భం వచ్చింది. ప్రతీ నిత్యం, ‘మగ పిల్లవాడు పుడితేనే నా దగ్గర ఉంటావు, లేనిదే నీవు రావు’ అని భయపెట్టిన పరిస్థుతులలో నవ మాసాలు నిండి, పిన్నమనేని సిద్దార్ధ హాస్పిటలు నందు బిడ్డకు కాన్పుకు జాయిను చేసాము. బిడ్డకు జూన్ 11, 2008 తారీఖు బుధవారం రోజున ఆపరేషన్ చేసేటప్పుడు బిడ్డ భయంతో వణికిపోయి, తంబి గారికి ప్రార్ధన చేసుకుని, నాతో, ‘నాన్న గారు, నాకు మగపిల్లవాడు పుడతాడా?’ అని ప్రశ్నించింది. నేను, ‘అంతా దేవుని చిత్తం, తంబి గారి మహత్యం, తప్పక నీకు మగబిడ్డ పుడతాడు’ అని చెప్పి ఆపరేషన్ థియేటరుకు పంపాను. ఆపరేషన్ తరువాత, తంబిగారి అద్భుత కార్యం వల్ల, నా కుమార్తెకు మగ పిల్లవాడు కల్గినాడు. బిడ్డకుతంబి ప్రకాష్అని పేరు పెట్టుకున్నాం. ఇది నా గొప్ప సాక్ష్యం. ఇది యదార్ధం.

వనమాల జోసఫ్, కోడూరుపాడు.
13 జులై 2009

వనమాల జోసఫ్

No comments:

Post a Comment