సాక్ష్యం 32
ధర్నాసి మరియమ్మ
మానికొండ,
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
80 సంవత్సరములు
నా పేరు ధర్నాసి మరియమ్మ. మా ఊరు మానికొండ. తంబిగారు మా ఊరు వచ్చినప్పుడు నుండియే
నాకు పరిచయం. అప్పుడు నాకు సుమారు 10 సంవత్సరముల వయస్సు. అప్పుడప్పుడు మానికొండ వచ్చేవారు. వారు వస్తుంటే ‘పిచ్చోడు వచ్చాడు, పిచ్చోడు వచ్చాడు’ అని పిల్లలు పరిగెడుతుంటే మేము కూడా
వెళ్ళాము. అప్పుడు వారితో బూతులాడు తున్నారు
పిల్లలు. బూతులు మాట్లాడుతుంటే స్వామికి
రక్తం కారుతుంది.
ఎక్కడ చూసినా రక్తమే
శిరము నుండి, డొక్కలో నుండి, కాళ్ళ నుండి, చేతుల నుండి రక్తం కారటం నేను ప్రత్యక్షముగా
చూశాను. అప్పుడు నేను అమాయకు రాలిని, ఏమీ తెలియదు. పంచ గాయాలని తర్వాత తెల్సింది. అప్పుడు అంత విజ్ఞానం లేదు. తర్వాత తెలుసుకున్నాను. అదే నేను మొదటిసారి చూడటం. ఎక్కడెక్కడ రక్తం వచ్చింది నేను చూశాను. అది శుక్రవారం. ప్రభుదాసు మాష్టారు గారి అన్న, అక్క బడి చెబుతుంటే బడిలోకి వెళ్ళేవారు. బడిలోకి వెళితే ప్రక్కన అందరు నిలబడు
తున్నారు. “వద్దు, ఇక్కడ వద్దు, వెళ్ళిపొండి” అని అందరిని వెల్లగొడు తున్నారు తంబిగారు. వెల్లగొడుతుంటే నేను కంతల గుండా చూసాను. మా చిన్ను డ్రామాలేసేటప్పుడు నేను అతనితో
మాట్లాడాను. గుడి ప్రక్కనే మా ఇల్లు. తంబి గారికి గుర్తే. అక్కడ కుర్చీ వేస్తే కూర్చొనే వారు. అప్పుడు మేమందరం వెళ్ళేవాళ్ళం.
దొంగతనం చేసిన వాళ్ళను ఇలా అడిగేవారు. “నీవు ఇప్పుడు ఇది ఎక్కడ నుండి తెచ్చావో
నేను చెపుతాను”
అని అనేవారు. కోపం ఎప్పుడూ ఉండేది కాదు. ఆయనకు ఇష్టములేని పనులు మనం ఏమన్నా చేసామను
కోండి, అప్పుడు ఆయన సీరియసుగా వుండేవారు. పలికేవారు కాదు. ఒక్కరే బడి లోనికి వెళ్ళిపోయే వారు. మానికొండలో వంతెనలో రాళ్ళు వేసి కొడుతుంటే, అటు ఇటు తప్పుకున్నారు. కాని, ఒకళ్ళ నొక మాట కూడా అనలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు బయటకి
వచ్చారు. అప్పుడు అతన్ని తీసుకు వచ్చి
మానికొండలో ఇల్లు కట్టారు. అప్పుడు చూశాను.
No comments:
Post a Comment