సాక్ష్యం 31
పేరు : మరియమ్మ
ఇంటి పేరు : పులిపాక
పుట్టిన తేది : 80 సం.లు
వృత్తి : కూలి
అడ్రెస్ : పులిపాక మరియమ్మ, తేలప్రోలు
గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా
నాకు 10 సం.లు ఉన్నప్పుడు, బ్రదర్ జోసఫ్ తంబి గారిని కలిశాను. మా గ్రామమునకు వచ్చినప్పుడు, పిల్లలను చేరదీసి, ప్రతీ ఇంటికి వెళ్లి
జపమాలను చెప్పించే వాడు. అనేక
ప్రార్ధనలను మాకు నేర్పించి యున్నాడు. అనేకసార్లు, నేను
వారికి భోజనమును వండిపెట్టి యున్నాను. ప్రతీ శుక్రవారము మధ్యాహ్నం 3 గం.ల వరకు ఉపవాసము ఉండి ప్రార్ధన చేసేవారు.
ఆయన మరణించిన తర్వాత, ఒకసారి నా ముఖము మీద, చేతుల మీద పొక్కుల
వచ్చినాయి. ఎంతో బాధగా ఉండేది. నేను తంబిగారికి ఇలా ప్రార్ధన చేసుకొని
యున్నాను. “బ్రదర్ తంబిగారా! నేను ఈ చేతులతో, నీకు భోజనమును వండినాను. ఇప్పుడు ఈ బాధను భరించలేక పోవుచున్నాను. నా చేతులను నీకు అర్పించుచున్నాను, తీసుకొనండి, నాకు ఇవి వద్దు” అని కన్నీటితో అలా ప్రార్ధన చేసినప్పుడు, అద్భుతరీతిగా, నేను స్వస్థత పొందియున్నాను.
No comments:
Post a Comment