సాక్ష్యం 30
మాదాల అరులయ్య
1941లో మా ఆడవాళ్ళకు జబ్బు చేసింది. ఇది మొట్టమొదట ఆడపిల్లలను కన్నపుడు జరిగిన
సంఘటన. కల్దిరారో స్వామి రికమెండ్ చేసి, మమ్ములను అమెరికన్ ఆసుపత్రికి పంపించారు. జోజప్ప తంబిగారు రెండు మూడు రోజులకు, ఒకసారి అక్కడికి వచ్చి పరామర్శ చేస్తుండే
వాడు. పిల్లను, తల్లిని, మమ్ము కూడా చూసి మాట్లాడేవాడు. ఎంతో మర్యాదగా వుండేవారు. ఇక్కడకు వచ్చిన తర్వాత మేము పెట్టిన
వ్యాపారం ఎలా వుంది? ఏంటి? అని అడిగేవారు. మా ఇంటికి వచ్చి “ఏం కూర,” అని మా భార్యను, మమ్ము కూడా అడుగుతూ వుండేవారు. తరువాత నేను మతం తీసుకున్నాను. మతం తీసుకున్నాక నెలరోజులకు, అప్పుడప్పుడు, పెద్ద స్వాముల దగ్గరకు [విచారణ
గురువులు] వెళ్ళేవాడిని. అపుడు తంబిగారు కూడా కనిపిస్తూ వుండేవారు. మాతో ఎంతో సన్నిహితంగా వుండేవారు. అలాంటప్పుడు, పెద్ద స్వాముల వారు ఒకసారి గుడి తలుపులు
తీసి, జపం చెప్పు కోవటానికి గుడిలోకి
వెళ్ళేసరికి, ఈ జోజప్ప తంబిగారు, పంచ గాయాలతో మోకరించి జపంచేశారు. అప్పుడు పంచాగాయ లొచ్చాయని, జాన్ కల్దిరారో వచ్చి స్పష్టముగా నాతో
చెప్పారు. నేను నమ్మాను. మరి యొకసారి వట్లూరు
స్వాములవారు, తంబిగారిని వట్లూరుకు రమ్మన్నారు. అప్పట్లో ఆయన రైలుకు వెళ్ళేటప్పుటికే, ‘ఈయన వచ్చి ఒక అరగంట అయిందని,’ ఒక వంట కుర్రాడు, స్టేషనుకు వచ్చి, ఫాదర్ గారితో చెప్పాడు. తరువాత తెల్లవారినాక కల్దిరారో స్వామి, మాతో చెబితే మేమంతా మంచి అద్భుతం అని
ఆశ్చర్యపోయాం.
“1945 జనవరి 15న చనిపోతున్నా” అని చెప్పాడు. మేమైతే నమ్మలేదు. న్యాయానికి ఆయన చెప్పినట్లే, ఆయన సమాధి అయింది. తర్వాత మా ఇంటికి ఫిరింగిపురం నుండి
కొంతమంది, జపాల కోసం వస్తే వారికి తంబి
గారి ప్రార్ధన వల్ల చాల మందికి అనేక రోగాల నుండి విముక్తి పొందారు. ఇప్పటికీ, మా ఇంటికి వస్తూ పోతూ వుంటారు యాత్రికులు.
No comments:
Post a Comment