సాక్ష్యం 33
పారాబత్తిన మరియమ్మ
మాని కొండ
70 సంవత్సరములు
నా పేరు పారాబత్తిన మరియమ్మ. మా ఊరు మానికొండ. తంబి గారితో పరిచయం జరిగినప్పుడు నాకు
సుమారు పాతిక సంవత్సరాలుంటాయి. మా భర్తగారు త్రాగుడుకు బాగా అలవాటు పడ్డారు. పేకాట కూడా ఆడేవారు. నేను ఏడుస్తుంటే “ఏడవ వద్దమ్మా, నీ భర్తకు మంచి మనస్సు వస్తుంది” అన్నారు. “ఏడవ వద్దమ్మా” అని అన్నారు. అంతలోకే పంచ గాయలు వచ్చాయి. అప్పుడు నేను గుడ్డతో తుడుస్తుంటే “తుడవ
వద్దమ్మా. నేను తుడుచుకుంటాను” అన్నారు. మా భర్తకు మంచి మనస్సు ఇచ్చాడు. త్రాగుడు మానేశాడు. తంబిగారు నిద్రపోవడానికి ఒక టైం అంటూ
వుండేది కాదు.
తెల్లార గట్ల మూడింటికి, నాలుగింటికి లేచేవాడు. లేచి గుడి చుట్టూ తిరిగే వారు. మేమాసమయానికి అటు వచ్చే వాళ్ళం. గుడి చుట్టూ తిరుగుతుంటే మేము కూడా తెరిగే
వాళ్ళం. తర్వాత మినుములు తీసుకు వచ్చి
గుగ్గిల్లు వండి పెడితే తినేవారు. కొంచెం వండినా ఎక్కువ అయ్యేవి.
ఆ ఊళ్ళో వాళ్ళు కొట్టుకుంటుంటే “కొట్టుకోవద్దు” అని చెప్పేవారు తంబిగారు. రాళ్ళు వేస్తుంటే “మీరు రాళ్ళు వేయవద్దు” అనేవారు. ‘అదేంటి! రాళ్ళు పెట్టి ఎందుకు కొడతారయ్యా! ఆయన గురువు. మన ఊరు ఎందుకు వచ్చారు. మంచి మనస్సుతో
వచ్చారు. మన ఊరు వచ్చి నాయనను మనం గౌరవించాలి’ అని నేను చెప్పే దానిని. ఇక అక్కడనుండి అవుటపల్లి వచ్చేశారు.
మా ఇంటి కెదురుగా ఒక ముసలమ్మ మినక్కంప తీసుకొచ్చి కొడుతుంది. “నీవు దొంగతనంగా మినక్కంప తీసుకు వచ్చి కొడుతున్నావు. ఆ కంప తీసుకెళ్ళి మళ్ళీ వేసిరా” అన్నారు. కంప తీసుకొచ్చి మళ్ళీ వేసిన దాకా ఊరుకోలేదు. పిల్లలు రాళ్ళు వేస్తున్నప్పుడు తంబిగారు నల్ల అంగీ వేసుకొని యున్నారు. చిన్న పిల్లలే వేసేవారు. ‘పిచ్చోడు, పిచ్చోడు’ అని రాళ్ళు విసిరి వేసేవారు. అప్పుడు మేము పెద్ద వాళ్ళం కోప పడే వాళ్ళం. “మీరు కోపపడకండమ్మా! పిల్లలకు తెలవదు” అనేవారు. వారికి కోపం రాదు. ఎప్పుడో సమయానికి కోపం వచ్చేది. అదీ పిల్లల గురించి. “మీరు రాళ్ళు వేయవద్దు, నేను పిచ్చివాన్ని కాదు” అనేవారు. సరిచెప్పే వారు, కాని పిల్లలను ఎప్పుడు కొట్టే వారు కాదు. మా ఇంటి ముందే దాదాపు మూడు నాలుగు నెలలున్నారు. మేము ఏమైనా తీసుకు వచ్చి పెడితే తినేవారు. మంచి మనిషి. ఆయన పేరు ఇంటి కొకరైనా పెట్టుకున్నాం. ఆయన పేరు జోసఫ్ తంబి అని ఆయనే చెప్పారు.
పారాబత్తిన మరియమ్మ, మాని కొండ
No comments:
Post a Comment