సాక్ష్యం 34
మాదాల సుశీలమ్మ
నేను ప్రసవం అయినప్పుడు కల్దిరారో
స్వామి నన్ను అమెరికన్ హాస్పిటలుకి పంపించారు. అప్పుడు జోసఫ్ తంబి గారు రోజు తెల్లారినప్పుడు, నా మంచం దగ్గరికి వచ్చే వారు. “బిడ్డా నీవు జపం చెప్పుకోవాలి, తప్పకుండా పైకి రావాలి,” అంటుండే వారు. ‘నా మంచం దగ్గరకు వచ్చి జపం చెప్పండి,’ అని మా అత్త గారు కూడా ఆయనను అడిగేది. జపం చెప్పు కున్నాం. మేము బెజవాడ నుండి వచ్చాక, జ్ఞానస్నానం తీసుకున్నాము. జ్ఞానస్నానం తీసుకున్నాక మా ఇంటికి నాలుగు, ఐదు రోజులకు ఒకసారి వస్తుండే వారు. వచ్చి, “జపం చెప్పుకున్నావా బిడ్డా,” అంటే ‘చెప్పు కుంటున్నాము స్వామి,’ అనే వాళ్ళం. “మీరు బాగా పైకి రావాలి. జపం చెప్పు కోండి మీ సంసారం మంచిది. మీ కుటుంబం మంచిగా వుండాలని నేను కూడా
జపం చెపుతాను,”
అనేవారు. ‘అట్లాగే లేండి స్వామి,’ అనేదాన్ని.
ఇక మేము గుడికి వచ్చినప్పుడు, చిన్న పిడతలో అన్నం వండి పది పన్నెండు
మందికి పెట్టేవారు.
ఇది నేను చాలా
సార్లు చూశాను.
జోజప్పకు ఎంత అదృష్టమో
అనుకునే వాళ్ళం.
మా ఇంటికి చాలా
మంది రెడ్లు వచ్చే వారు. వారు
అలా వస్తుంటే,
జోజప్ప గారిని
తలచు కుంటేనే వంటలన్నీ అయిపోయేవి. అలా చాలా అద్భుతాలు మాకు చూపించారు, ఆ రెడ్లు బాగా తంబి గారిని నమ్మి వచ్చి
ముసలి వాళ్ళకు మఠం కట్టించారు. మా ఇంటికి వచ్చి, మా పిల్లలతో కూడా బాగా వుండేవారు తంబిగారు. రేవుకి వచ్చినపుడల్లా పని గట్టుకొని
మా ఇంటికి వచ్చేవారు. నాలుగు, ఐదు రోజులకు ఒకసారి వచ్చేవారు.
మా ఆడపడుచు కూతురికి, మా మేనకోడలకి కూడా నేను జ్ఞానస్నానం
ఇప్పించాను. ఇప్పించిన తరువాత తంబి గారు
ఒకనాడు వచ్చి నా మీద పోట్లాట కొచ్చాడు. “ఆ అమ్మాయికి ఎందుకు జ్ఞానస్నానం ఇప్పించావు?” అని తంబిగారు అడిగారు. ‘ఆమె చక్కగా గుడికి వస్తుంది కదండి,’ అన్నాను. “నీకు తెలియదు, ఆమె కసలు ఇచ్చే పని కాదు. నేనుంటే ఇప్పించే వాన్ని కాదు. ఎందుకు ఇప్పించావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా?” అని నా మీద కేకలు వేశాడు. అలా అంటే ‘నాకు తెలియదు జోజప్ప గారా తండ్రీ,’ అన్నాను. ‘నాకు తెలువక ఇప్పించాను,’ అన్నాను. “అది ఎప్పటికి పైకి రాదమ్మా! అది పోవటమేనమ్మా,” అంటుండేవారు. వారు చెడిపోయారు. ఇప్పుడు వారి కుటుంబం అంతగా రావటం లేదు. ఎక్కడోల్లక్కడ చెల్లా చెదురై విడి పోయారు. ఈ విషయాలు ఇంత వరకు నాకు బాగా తెలుసు.
చనిపోయే ముందు, ఫలానా తారీఖున చని పోతానని, మా అందరితో చెప్పేవారు. ఆయన ఆ తారీఖు నాడే, పదిహేనవ తారీఖు నాడే చని పోయారు. ఇక్కడ గుది ముందే పంతుళ్ళు జీతాల కోసం
వచ్చేవారు. వస్తే “నేను అన్నం పెడతాను రండి,” అని తీసుకు వెళ్ళే వారు. నేను స్వయానా
చూశాను. చిన్న పిడతలో వండి, పది పది హేను మందికి పెట్టే వారు. ఇది నేను రెండు మూడు సార్లు చూశాను.
మరొకటి నేను చూడలేదు కాని విన్నాను. స్వామి వట్లూరు వెళ్ళటం; స్వామి వెళ్లక ముందే వీరు గుడిలో వుండటం. ఇది బాగా విన్నాను. మా ఇంటికి వచ్చే రెడ్లకు కూడా, చాలా అద్భుతాలు చూపించారు. వారే డబ్బులు పెట్టి, ముసలోళ్ళ మఠం కట్టించారు. అందరి జబ్బులు నయం అయ్యాయి.
ఒక రోజు ఒక అమ్మాయి వాళ్ళు, కోడి మాంసం వండు కున్నారట. కోడి మాంసం తింటుంటే, ఒక బొనికె గొంతులో అడ్డం పడి పోయింది. వారు ఆమెను, మా ఇంటికి తీసుకు వచ్చారు. వారు మాకు బాగా తెలిసిన వారు. ఆమెను నేను జోజప్ప గారి సమాధి దగ్గరకు, తీసుకు వచ్చాను. తీసుకు వచ్చిన తెల్లారి పాటికి జారి
పోయింది. మళ్ళీ మొన్న మొన్న, ఆమె కోడలికి జబ్బు చేస్తే, వెయ్యి రూపాయలు మొక్కుబడి చేసుకొని, మొగుడు పెళ్ళాం ఇక్కడికి వచ్చారు. మేము కూడా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు, మాది జోజప్ప గారి ఊరు అంటే వారు మమ్మేంతో
మర్యాద చేస్తారు.
అక్కడున్న రెడ్లందరు
కూడా, జోజప్ప గారిని బాగా నమ్మారు.
ఆయన క్లారమ్మ గారి ఇంట్లో మరణించారు. చనిపోయినప్పుడు నేను రాలేదు. అప్పుడు మా రెండవ అమ్మాయితో నేను బాలింత
రాలిని. అందుకే రాలేదు. క్లారమ్మగారి ఇంట్లో చని పోయారని తెలిసి, ఎంతో దుఖపడ్డాను. చనిపోతాను అని, చెప్పిన తేదీనే చనిపోయారు. అమ్మో! జోజప్ప గారు బ్రతికి ఉన్నప్పుడు ఎన్నో
అద్భుతాలు చేశారు.
అందరికీ భోజనాలు
పెట్టారు. చిన్న పిడతలోనే చేసేవారు. అతడు చని పోయాడని మేమందరము చాలా చెప్పుకున్నాం. ఆ జోజప్ప గారి దయవల్లే మేము జ్ఞానస్నానం
తీసుకున్నాము.
మా కుటుంబం పైకి
వచ్చింది.
No comments:
Post a Comment