సాక్ష్యం 22
మాదాను
శౌరయ్య
పెద్దఅవుటపల్లి
గ్రామము
కల్దిరారో
గురువుల వద్ద వంట పని చేసేవారు
బ్రదర్
జోసఫ్ తంబి గారు 1943వ సంవత్సరములో అవుటపల్లికి
వచ్చారు. ఆయన గురించి నాకు
కొన్ని విషయాలు తెలుసు. ఆయన
చేసిన అద్భుతాలు తెలుసు. ప్రతి
శుక్రవారం ఆయనకు పంచ గాయలు వచ్చేవి. నేను
కళ్లారా చూసిన విషయం అది. ఒక
వ్యక్తి కాలుకి పుండు అయితే, ఆ పుండును నాకి స్వస్థత పరచాడు. ఆ వ్యక్తి మొదటగా, కల్దిరారో
స్వామి దగ్గరకు వచ్చాడు. ఆ
తరువాత జోజప్ప గారు ఆ వ్యక్తిని పిలిచి, మాట్లాడి, విషయ తెలుసుకొని, ఆ పుండు నాకి,
ఏదో పిచ్చి ఆకులు వేసి కట్టు కట్టి పంపించి వేసారు. అది కట్టినప్పుడు నేను
ఆ వ్యక్తితో, ‘అది మందు కాదు, నువ్వు చస్తావు’ అని అన్నాను.
ఆ వ్యక్తి ఏదో అనుకుంటూ వెళ్ళిపోయాడు.
అప్పుడు నేను కల్దిరారో స్వామి వద్దకు వెళ్లి, ‘తంబిగారు ఆ వ్యక్తి కాలు పుండు నాకాడు స్వామి,’
అని చెప్పాను. అందుకు
స్వామి, ‘పిచ్చోడా’ ‘కుక్కలాగా నాకట మేంటి,
ఛీ ఛీ’ అని కసురు కున్నాడు.
ఆ వ్యక్తిని మరల రెండు రోజుల తరువాత రమ్మని చెప్పారు తంబిగారు. రెండు రోజుల
తరువాత, ఆ వ్యక్తి వచ్చినప్పుడు, జోజప్ప గారు ఇంటి దగ్గర లేరు. అప్పుడు నేను ఆ వ్యక్తితో, ‘పుండు ఎలా ఉంది’ అని అడిగాను,
‘తగ్గిపోయింది బాగానే ఉంది’ అని
అన్నాడు. అప్పుడు నేను, ‘అట్లాగే ఉంటుందిలే! మంచి మందు కాదుకదా! ఎలా తగ్గుతుంది.
ఏది చూద్దాం కట్టు తీయి’ అని అన్నాను. అందుకు అతను, ‘తీయనండి.
ఆ సాధువు [జోసఫ్ తంబి] గారే రావాలి, అప్పుడే కట్టు తీస్తాను’ అని అన్నాడు. అందుకు నేను, ‘ఆయన ఇక్కడ లేడు. ఇంకో వారం రోజులు
దాకా రాడు. ఎటో పోయాడులే!’ అని అన్నాను. అందుకు ఆ వ్యక్తి, ‘ అయితే ఆయన వచ్చిన తర్వాతనే కట్టు తీస్తాను’ అని అన్నాడు. అప్పుడు నేను, ‘ఎహే, కట్టు తీయి చూద్దాం’ అని
బలవంతం చేయగా, ఆ వ్యక్తి కట్టు తీశాడు. ఆశ్చర్యం! కాలు చాలా శుభ్రంగా ఉంది. ఎంతో పెద్ద పండుతో ఉన్న వ్యక్తి, ఇప్పుడు
పూర్తిగా స్వస్థత పొందాడు. ఇది నేను నా కళ్లారా చూసిన విషయం, అద్భుతం! అప్పుడు నేను
కల్దిరారో స్వామిని పిలిచి ఆ వ్యక్తి కాలుని చూపించాను.
స్వామి ఎంతగానో ఆశ్చర్యపోయారు. మేమందరం ఇది ఒక గొప్ప అద్భుతం అని గ్రహించాము.
ఒకసారి నేను నివసించే ఇంటి ముందు ఉన్న కుంకుడు చెట్టు కొమ్మని జోసఫ్ తంబిగారు నరుకు తున్నాడు. నేను ఆయన కాలును పట్టుకొని క్రిందకు లాగి తోసాను. ఆయన పరుగెడుతూ వెళ్లి పోయాడు. ఒక అరమైలు దూరం వెళ్ళాడు. పదిమంది పిల్లలు, రోడ్డు మీద ఆడుకుంటున్నారట! ఆ పిల్లలు ఆడుకుంటుంటే, “ఒరేయ్ పిల్లలూ! మీరు ఇక్కడ ఆడుకుంటే గొడ్లు అవి వస్తాయి, వెళ్లి నీడలో ఆడుకోండి” అని అన్నారట. ఆ పిల్లల్లో ఒకరు తంబిగారితో, ‘నీవు చెట్టుకొమ్మ కొడితే, ఆ ఇంటాయన మెడబట్టి గెంటితే ఇక్కడికి వచ్చావు. నీకు కష్టం కానీ మాకేం కష్టం,’ అని అన్నారు. అలా అనేసి ఆ పిల్లలు అక్కడ నుండి మాయమై పోయారట. తరువాత ఈ సంఘటనను తెలుసుకొనిన మేము, ఆ పిల్లలు సన్మనస్కులు అని మేము అనుకున్నాము.
అక్కడినుండి సిక్కాదు
అనే ఒక ఊరికి వెళ్లారు. ఆ
ఊరి మాష్టారు గారి దగ్గరికి వెళ్లి “కొంచెం
అన్నం పెట్టు,” అన్నారు తంబి గారు. అన్నం తిన్న తరువాత పై విషయం అంత చెప్పారు తంబి
గారు. చెప్పి, “ఈ విషయం ఎప్పుడు ఎవరికి చెప్పవద్దు. నేను చచ్చిపోయిన తరువాత చెప్పు” అని అన్నారు.
ఆయన చచ్చిపోయిన తర్వాతనే, ఈ
అద్భుతాల గురించి తెలుసుకోవడం జరిగింది.
చచ్చిపోయే
ముందు, మూడు నెలల ముందే పెట్టెను చేయించు కున్నారు.
ఆ పెట్టెలో పడుకొని నన్ను పిలిచేవారు.
మూత పెట్టి నన్ను పిలిచేవారు. నేను ఆ పెట్టె మీద కూర్చుని ఎగిరే వాడిని.
అప్పుడు “నువ్వు
లే, నువ్వు లే” అని చేయి పట్టుకుని
పైకి లాగేవారు. తరువాత, “ఈ పెట్టె బాగుందా?
నాకు సరిపోయిందా,” అని కొంచెంసేపు గమ్మత్తుగా నవ్వుకునే వాళ్ళం.
అవుటపల్లికి
టీచర్స్ ప్రతినెల మీటింగుకు వచ్చేవారు. వచ్చినప్పుడు వారిలో కొంత మందికి భోజనం పెట్టేవారు
తంబిగారు. ఒకరోజు అలా పెట్టినప్పుడు
అది ‘సద్ది అన్నం,’ అని వారు సరిగ్గా తినలేదు. అయినను తంబిగారు, “ఇంకా కొంత మందికి అన్నం పెడతా రండి,” అని అన్నారు.
అప్పుడు, ‘అది
సద్ది కూడురా, తినకండి రా,’ అని అప్పటికే తిన్నవారు మిగతా వారితో
అన్నారు. అయితే వారిలో కొద్దిమంది విశ్వాసులు, ‘ఏదో సద్దో బద్దో తినొచ్చు కదా,’ అని కొందరు లోపలికి వెళ్లారు. వెళ్తే వాళ్లకు మంచి వేడి అన్నం,
పప్పు చారు, బంగాళదుంప
యిగురు దొరికిందని, వాళ్లకు చెప్పారు. అప్పుడు మిగతావారు, ‘ఎలా! అది మీ కెలా దొరికింది’ అని అడిగితే, ‘మేము విశ్వాసముతో
పోతే, మాకు అద్భుతం చూపారు
తంబిగారు’ అని వారు చెప్పారు. అద్భుతాలు గొప్పవి,
అని వారు చెప్పుకున్నారు.
వట్లూరు
జార్జి స్వాములవారు ఇక్కడ టీచర్ల మీటింగుకు వచ్చేవారు.
ఆయన వెళ్లేటప్పుడు జోజప్ప తంబిగారి గది దగ్గరికి వెళ్లి, ‘జోజప్ప గారా!
ఒక వారం రోజులు మా ఊరికి రండి,’ అని అడిగారు. అందుకు
తంబిగారు, “స్వామి! నేను ఇప్పుడు రాలేను,
నాకు జబ్బు గా ఉంది. నేను
నడువ లేను, నాకు బాగున్నప్పుడు
వస్తానులే,” అని అన్నారు. అప్పుడు నేను మరియు వంట మనిషి మాదాను శౌరి, జార్జి
స్వాములవారిని సాగనంపడానికి స్టేషనుకు వెళ్ళాము.
జార్జి స్వాముల వారు, బండి ఎక్కి వెళ్లిపోయిన తరువాత మేము తిరిగి
వచ్చాము.
జార్జి
స్వాముల వారు, వట్లూరు వెళ్లేసరికి,
తంబిగారు మెట్ల దగ్గర కూర్చుని ఉన్నారు. ఆశ్చర్యముతో, స్వామి, ‘ఎట్లా
వచ్చావు,’ అని అడిగారు. అందుకు తంబిగారు, “నేను ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు నా వీపు మీద రెండు హస్తాలు వస్తాయి. ఆ హస్తాల ద్వారా నేను అక్కడ దిగి పోతాను. ఈ మహిమ నాకు వస్తుంది,”
అని చెప్పారు. జార్జి
స్వాములవారు ప్రతి సంవత్సరము తం,తంబి గారు చనిపోయిన రోజున పూజ చేసి, ఈ విషయాన్ని తన ప్రసంగంలో తప్పక చెప్పేవారు.
ఇంటి
వెనుక తాటి చెట్టుకు, ఒక
కంద దుంప తగిలించారు. ఆ
కంద దుంపనుండి రోజూ, ఒక
ముక్క కోసుకొని, మరగబెట్టికొని, తినేవారు.
ఆయన టీ, డికాషన్
త్రాగేవాడు. అది త్రాగి త్రాగి, పైత్యం అయ్యిందో ఏమో! ఆయన చనిపోయే రోజు నేను అక్కడే
ఉన్నాను. ఆయన మంచం దగ్గరే ఉన్నాను. తంబిగారు, “నన్ను కాస్త లోపల పడుకో పెట్టండి,”
అని అడిగారు. ఆయన
చనిపోయే రాత్రి అంతా ఆయన దగ్గరే ఉన్నాను. ఆ రాత్రంతా ఆయనకు విరోచనాలు, డోకులు అయి పోయినవి. ఆయన
బట్టలన్నీ మురికి అయి పోయినవి. రాత్రి
ఒకసారి బయటకు వెళ్లి వచ్చి ఆయన ముఖం వైపే చూస్తూ ఉండిపోయాను.
మాదాను శౌరయ్య, పెద్దఅవుటపల్లి
No comments:
Post a Comment