సాక్ష్యం 27
పేరు :
వేమూరి శౌరీలు
తండ్రి : పరంధామయ్య గారు
గ్రామం : మానికొండ, ఉంగుటూరు మండలం, కృష్ణా
జిల్లా.
వయస్సు : 92 సంవత్సరాలు
1వ సంఘటన:
నా భర్త గారైన పరంధామయ్య గారు
పెద్దవుటపల్లిలో, బోయపాటి క్లారమ్మ గారికి తమ్ముడు అగుటచే, అవుటపల్లి నుండి తరచూ తంబిగారు, మానికొండలోని
మా ఇంటికి వాచ్చే వారు. మా
ఇంటి వరండాలో, కూరగాయలు అమ్ముకునే వారు. రాత్రి పూట బస చేసేవారు. ఆ సమయంలో అన్నం తినమంటే తినేవారు. అన్నం పెట్టటానికి లోపలకి వెళితే, మరల
పాత్ర నిండా అన్నం వచ్చేది. ‘గారెలు తింటావా?’ అని అడిగినప్పుడు, తిన్నారు.
తరువాత ఎప్పుడూ కూడా మీరు జ్ఞానస్నానం
తీసుకోమని చెప్పేవారు. తరువాత
ఆ రాత్రి విశ్రాంతి కోసం గది ఇచ్చాము. ఆ గదిలో రాత్రంతా మేల్కొని ప్రార్ధన చేస్తూనే వుండేవారు. ఒక రోజు మా ఇంటికి వచ్చి ఒక రూపాయి ఇమ్మన్నారు. మేము ఇచ్చాము, ఆయన ఒక బీద వాడికి ఇచ్చారు. మళ్ళా వచ్చి అడిగారు మేము ఇవ్వనన్నాము. ఆయన వెళ్లి పోయాడు.
2వ సంఘటన:
మా మనుమరాలుకి 12 సం.లు, పేరు రమాదేవి. ఆమెకు మెదడు పక్షవాతం వచ్చింది. విజయవాడలో అన్ని హాస్పిటల్సుకి తిప్పాము. కాని నయం కాలేదు. నేను అన్నం 15 రోజులు తినలేదు. రోజూ ప్రార్ధన చేసేదాన్ని. నా మనుమరాలుకి నయం అయితే నీ [తంబి] సమాధి వద్ద అన్నదానం చేసి నేనుకూడా అక్కడే తింటాను అని మ్రోక్కుకున్నాను. అప్పుడు సమాధిని పాలతో కడుగుతాను అని మ్రొక్కు కున్నాను. నేను ఇంటిలో ప్రార్ధన చేసుకుంటూ వుండగా అకాశానికి నిచ్చెన వేసి తంబిగారు దిగివచ్చి నా ఒడిలో నా మనుమరాలిని పడవేసినట్లుగా నాకు కనిపించింది. ఆ మరుసటి రోజు తెల్లారి, ‘నీ మనుమరాలు కొంచెం కోలుకుంది’ అని హాస్పిటలు నుండి కబురు వచ్చింది. అప్పుడు తంబిగారిని ప్రార్ధనతో వేడుకున్నాను. నా మనుమరాలికి పూర్తిగా నయం అయింది. ఆ తరువాత మ్రొక్కుబడి తీర్చుకున్నాం.
3వ సంఘటన:
మాకు అప్పట్లో ప్రైవేట్ బస్సులు
ఉండేవి. వాటి విషయములో ఒకసారి మా మీదకు
కేసు వచ్చింది.
అప్పుడు హైకోర్ట్
మద్రాసులో ఉండేది.
వారు కేసును, మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు. మాకు చాలా భయం కలిగింది. మద్రాసు కోర్టులో కేసు మాకు అనుకూలంగా
రావాలని తంబి గారిని వేడుకున్నాం.
కేసు మాకు అనుకూలముగా వస్తే
తంబిగారికి సమాధి కట్టిస్తాం, మూడు రోజులు అన్నదానం చేస్తాం, అని మొక్కుకున్నాం. కొంత కాలం తర్వాత మాకు మద్రాసు హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. తంబి గారు చేసిన మేలుకు మేము ఆయనకు సమాధి
కట్టించి, మూడు రోజుల పాటు నిత్య అన్నదాన
కార్యక్రమం చేపట్టి మా మొక్కుబడి తీర్చుకున్నాం.
వేమూరి శౌరీలు, మానికొండ
No comments:
Post a Comment