చింత గుంట యేసురత్నం
భూతమల్లిపాడు
76 సంవత్సరములు
నా పేరు చింతగుంట యేసురత్నం. మా ఊరు భూతమల్లిపాడు. నాకు తంబిగారు 1941లో పరిచయం అయ్యారు. నాకు దాదాపు 21-22 సం.లు వుంటాయి. మా ఊరు అవుటుపల్లి విచారణ. కల్దిరారో స్వాములవారు పూజకు వస్తున్నారు. అప్పుడు తంబిగారు కూడా వచ్చారు. వచ్చి బయటే మోకరించారు. అందరం గుడిలో వున్నాం. దాదాపు 60-70 మంది వరకు ఉన్నాము. పూజకని వచ్చారు స్వామి. వారి వెంబడి వచ్చారు తంబిగారు. మాకు అంతకముందు పరిచయం లేదు. ‘ఎవరండి?’ అని తంబిగారిని అడిగితే, “అవుటపల్లిలోనే
ఉంటున్నాను” అని చెప్పాడు. పేదవాడిగా వచ్చాడు. వారు మద్రాస్ నుండి వచ్చారని అన్నారు. మంచి వాడని, మంచి భక్తి పరుడని అందరు అనుకొంటున్నారు. వారిని కలిసి స్తోత్రం చేసాం, కాని అంత పరిచయం కాలేదు. సరే ఏం చేశామంటే నాలుగవ రోజు, ఐదవ రోజు ఇద్దరు ముగ్గురుం పెద్దవాళ్ళం
కూర్చోని, మరి జోజప్ప గారిని ఒకసారి చూసి
వద్దాం, మన ఊరికి కూడా తీసుకువచ్చి అశీర్వదించమందాం
అని అనుకొన్నాము.
అందరు మంచి భక్తి
పరుడని అనుకుంటున్నారు. అటువంటప్పుడు
మనం వేదిస్తే బాగోదేమో అని చెప్పేసి మేము ప్రయాణమయ్యాం. ఈ లోపల ఒకరు పెసర్లు, మినుములు అమ్ముకొని వచ్చారు. వచ్చింది మాకు తెలియదు. ఇక్కడకు (అవుటపల్లికి) వచ్చిన తరువాత, జోజప్ప గారు, “ఏమిటి మీరు వచ్చారు?” అని అడిగారు. ‘మీ కోసమే స్వామి’ అని చెప్పాము. “నా తండ్రిని చూడని వారు, నన్ను చూడటానికి ఎందుకు వచ్చారు?” అని తంబిగారు అన్నారు. మరల, “సరే పదండి గుడిలోనికి, నేను స్వామిని కేక వేస్తాను, ప్రార్ధన అదంతా చేసుకొని నా దగ్గరకు
రండి” అన్నారు. సరే కల్దిరారో స్వామి దగ్గరకి వచ్చాము.
తంబి గారు వచ్చారు. సరే అని వచ్చి తలుపు తీశారు. మాకు మరి ఎక్కువ పరిచయం లేదు. అప్పటికే కల్దిరారో స్వామి ఎగిరి పడుతున్నాడు. అంతకు ముందు అసలే జోజప్ప గారు అంటే కోపంగా ఉండేది. అప్పటికే దగ్గరికి వస్తున్నారు. ఆ టైంలో మేము వచ్చాము అన్నమాట. స్వామి వచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం. స్వామికి కూడా స్తోత్రం చేశాము. జోజప్పగారు వున్న నివాసంలోకి వచ్చేశాము. వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే “కూర్చోండి” అన్నారు. కూర్చున్నాం, కూర్చున్న తర్వాత “బయట బత్తాయి కాయలు ఉన్నాయి, ఎప్పుడో తీసుకు వచ్చాను, తీసుకు రండి తిందాం” అన్నారు. తీసుకొచ్చాము, తినడానికి తలా ఒక కాయ ఇచ్చారు. వారు తినలేదు లేండి, మేము తిన్నాము. “బాగున్నాయా?” అని అడిగారు. ‘బాగానే ఉన్నాయి స్వామి’ అని అన్నాము.
తరువాత ఏం చేశాడంటే, “బయట తేగలు ఉన్నాయి తీసుకురండి” అన్నారు. వెళ్లి చూశాం. తేగలు ఉన్నాయి, తీసుకు వచ్చాము. తల
ఒకటి ఇచ్చారు,
తినమన్నారు, తిన్నాము. తిన్న తర్వాత “ఇంటి వెనకాల పాలు ఉన్నాయి తీసుకురండి” అన్నారు. పాలు తీసుకు వచ్చాము. తీసుకువచ్చాక పాలు కొద్దిగా తాగారు. గ్లాసులో పోసి, వారు త్రాగిన తరువాత ఏం చేశారంటే, కొద్దిగా
మిగిల్చారు. “నువ్వు తాగుతావా” అని నన్ను ప్రశ్నించారు. ‘సరే స్వామి, తాగుతా’ అన్నాను. త్రాగుతున్నానే కాని కొద్దిగా ఎంగిలి
అనేది మనసులో ఉంది.
“ఎందుకు భయపడుతున్నావు?” అని తంబిగారు అడిగారు. “ఎంగిలి అని భయపడుతున్నావా?” అన్నారు. ‘లేదులే స్వామి’ అని చెప్పి క్షమాపణ
కోరి త్రాగాను.
సరే ఇతను దొంగతనం
చేసి వచ్చాడు కదా!
అని, అతను రాగానే అడిగాడు. ‘నీవు ఎందుకు దొంగతనం చేశావు?” అని అడగగానే, అతను ఏమీ చెప్పలేక పోయాడు సమాధానం. మేము కూడా ఏం అనలేదు. ఆయనకు ఎదురుగా ఏదైనా ఇష్టం లేని మాట
చెప్తే ఒప్పుకునేవారు కాదు స్వామి. జోజప్పగారు పాలు త్రాగి కుర్చిమీద పడుకున్నారు. ఆయాస పడుతున్నారు. ‘ఏంటి స్వామి, ఆయాస పడుతున్నారు?’ ఆ వరకు మాకు తెలియదు పంచ గాయాల సంగతి. ఆయాస పడుతున్నారు. మేము తెల్లబోయాము. తర్వాత చూశాం. అప్పటికే ముక్కు మీదకు ధారలు వచ్చినవి. అక్కడ టేబుల్ మీద బారెడు గుడ్డ ఉన్నది. గుడ్డ తీసుకు రమ్మన్నారు నన్ను. తీసుకు వచ్చాను. గాయాల తుడిచారు. తీసి అక్కడ పెట్టారు. కాసేపయ్యాక ఆ రక్తం గుడ్డ మీద కూడా లేదు. మళ్లీ తెల్లగానే ఉంది. తీసేటప్పుడు గాయల్లోకి దూర్చారు. తీశారు. రక్తం కనబడింది చూశాము. తర్వాత మళ్ళా చూస్తేనేమో ఆ గుడ్డ మీద
కూడ రక్తం లేదు.
“ఆ టేబుల్ మీదే
పెట్టు” అన్నారు. అది వారు ప్రార్ధన చేసుకునే టేబుల్. సరే, అది అయిన తర్వాత ‘మరి స్వామి! మా ఊరిని ఆశీర్వదించాలి, మా ఊరు రావాలి’ అన్నాము. ‘సరే వస్తా ఏ ఊరు మీది?” అని అడిగారు తంబిగారు. ‘భూతుమల్లిపాడు స్వామి’ అన్నాము. ‘సరే, భూతుమల్లిపాడు ప్రయాణమై వెళ్దాం పదండి” అన్నారు. పయనమై, చేలకు అడ్డంపడి వెళ్ళాము. కాలువ అప్పుడు ఫీబ్రవరిలో కట్టేసే వాళ్ళు. బాగుంది. ఇంతలో తుంది ఈ ఏలూరు కాలవ (రొమ్ముల వరకు చూపిస్తూ) సరే మేం పెద్దోళ్ళం కదా! బాగానే ఉన్నాం. ఆవ పచ్చ వేసి ఆ ఆవ పచ్చ మీద కూర్చో బెట్టి
తంబిగారిని దాటించాము. దాటించాక, “మీరు గుడ్డలు అవి పిండుకొని నెత్తి మీద
వేసుకోండి” అన్నారు. పిండుకొని వేసుకున్నాం, అది వేసవి కాలం ఇక ప్రయాణమై వస్తున్నాము, వస్తుంటే ఈలోపల ఏం చేశారంటే అక్కడికి
దరికి వెళ్ళిన తర్వాత “ఇంటి
వెనకాల బియ్యం ఉన్నాయి, తీసుకురండి
మనం వంట చేసుకుంటానికి బాగుంటుంది,” అని తంబి గారు అన్నారు. సరే స్వామి చేస్తామని, చెప్పి ఒక మనిషి వచ్చాడు. వచ్చి ఇంటి వెనకాల ఉన్న బియ్యం తీసుకువచ్చారు. ఒక కుండలో పోసుకు వచ్చారు. అవి ఒక రెండు తవ్వలు ఉండవచ్చు. సరే మా
ఊరు నడక మీదనే చేరాం. జోజప్ప
గారితో నడిస్తే, నడిచినట్లు ఉండేది కాదు అసలు, మహానుభావుడు.
తంబిగారిని మా ఊరికి తీసుకు
వెళ్ళిన తర్వాత కుర్చీ వేసి గుళ్లోనే కూర్చో బెట్టాము. ఈలోపల ఏం చేశారంటే, అక్కడ ఒక గేదె లెగవ లేక పడిపోయింది ఎండలో
పడుకుంది. “ముందు దానికి నీడవేసి నీళ్లు
పెట్టండి, ఏడు గంటలు అయిన తర్వాత మాట్లాడు
కుందాం” అన్నారు. సరే వెళ్ళి ఆ గేదెకు నీడవేసి నీళ్లు
పెట్టి వచ్చేసాము.
మా పెద్దాయన సంఘ
పెద్ద. ఆయన పాలు తీసుకు వచ్చి ‘స్వామి మా పాలు త్రాగాలి!’ అన్నారు. ‘మీ పాలు త్రాగడానికి రాలేదు నేను” అని అన్నారు తంబిగారు. అప్పుడాయన ‘తాగాల్సిందే, తాగకపోతే ఊరుకోము’ అన్నారు గట్టిగా. ఆయన అన్నది ఇదే. అనే సరికి తంబిగారు ఏం చేశారంటే, “నేను వెళ్ళిపోతున్నా” అన్నారు. ‘ఏంటి స్వామి! జనం అందరూ కిక్కిరిసినట్టున్నారు స్వామి! మీ కోసం వచ్చారు స్వామి! ఉండండి స్వామి,’ అంటే ఇక ఉండలేదు. నేను కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడాను. బ్రతిమిలాడినా ఉండలేదు. “ఇక్కడ ఉండటానికి నాకు ఇష్టం లేదు. నేను
వెళ్ళిపోతున్నాను.”
ఇదే మాట మీద ఉన్నారు.
ఇక మేము ఆపలేమని తప్పుకునే సరికి, ప్రయాణ మయ్యారు. అప్పటికే
పొద్దుపోయింది.
“మర్రీడు వెళుతున్నాను” అన్నారు. ఎప్పుడు వెళ్తారు స్వామి, టైం లేదు స్వామి, మీరు వెళ్లలేరు స్వామి, అని నేను వెంబడి పడుతూనే ఉన్నా. వెంబడి పడుతూ ఉంటే “నేను ఉండను, వెళ్ళిపోతాను” అని ప్రయాణ మయ్యారు. ఇక అక్కడనుండి నేను వచ్చేశాను.
వారి స్లీవ, చదువుకునే పుస్తకం, ప్రార్ధన చేసుకునేవి, ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఆయన చేతిలో స్లీవ ఉంటుంది. ఆయన దగ్గర ఒక చిన్న పెట్టె ఉండేది. పుస్తకం ఆ పెట్టెలో ఉంటుంది. స్లీవ మాత్రం ఎప్పుడూ చేతిలోనే ఉంచుకునేవారు. ‘స్వామి, మీరు ఇప్పుడు వెళతామన్నారు, ఎంత ప్రాధేయపడ్డా ఉండను అన్నారు’ అని
బాధపడ్డాను. త్వరగా వెళ్ళిపోయారు. పుస్తకం అవి అన్నీ కూడ నా దగ్గరే ఉన్నాయని
నాకు ఆందోళనగా వుంది. ఏం
చేయాలి. ఎక్కడున్నారు ఇప్పుడు? మర్రీడు వెళతానన్నారు మరి. వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు. అక్కడ నా గురించి బస్సులో ఎక్కితే దించేసారు. ఆ బస్సు అక్కడే ఆగిపోయింది. నేను వెళితేనే అది బాగు పడుద్ది.” అని వెళ్ళిపోయారు.
మూడవ నాడు వారు అవుటపల్లి చేరారేమోనని
నేను వచ్చాను.
ఆ రోజు మానికొండ
పిల్లలు ఇక్కడ డ్రామా ఆడుతున్నారు. నేను ఆ పుస్తకం, ఆ బియ్యం, ఆ సిలువ ఇవన్నీ తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నన్ను చూసారు. దుఃఖపడి ఏడ్చారు తంబి. ఒక పావుగంట ఏడ్చిన తర్వాత ‘సరే తీసుకు వచ్చాను నాయన, తప్పు నాదే కాబట్టి నన్ను మన్నించండి,’ అని బ్రతిమిలాడాను. అప్పుడు తంబిగారు, “ఉండు భోజనం చేసి వెల్దువు గాని” అన్నారు. ఆ రోజు ఈ గ్రామంలో కీకారణ్యం లాగా మబ్బు
పట్టింది. కల్దిరారో స్వామి రెండు కర్రలు
వేసుకొని అటు ఇటు తిరుగు తున్నారు. మేమేం చేసామంటే బోలెడు దూరం కదా స్వామి, వెళ్ళిపోతాం స్వామి అన్నాం, అంటే, “వెళ్ళవద్దు
మీరు ఉండండి. మబ్బు వెళ్లిపోద్ది, మనల్ని ఏం చేస్తుంది” అని తంబిగారు అన్నారు. ఆయన వచ్చి స్టేజి ముందు పది గజాలు వెనక్కి
వెళ్లి అక్కడ కూర్చుంటే తంబిగారికి కనిపించకుండా చీమలు పట్టినవి రెక్కలు, చీమలు విపరీతంగా పట్టినవి. ఎవ్వరూ ఒక్క చీమను కూడా ఇట్లా తీసి వేసి
కూడా ఎరుగరు, మహానుభావుడు. ఒక అరగంట సేపు అట్లాగే కూర్చొని వున్నారు. ఈ అరగంట సేపట్లో మబ్బు లేదు మాయలేదు. ఏమైపోయినాయో తెలియదు. అట్లా జరిగిపోయింది తంబి గారికి.
ఆ తర్వాత వచ్చి, “భోజనం పెడతాను రండి” అన్నారు. చిన్న పిడతలోనే వండారు. ఒక ఇరవై, ముప్పై మానికొండ వాళ్ళు, నేను, అందరం భోజనం చేసాం. అప్పుడు చింతకాయ పచ్చడి, చింతకాయ చారు అవి కాశారు. అవి త్రాగాము. అది జరిగింది. ఇంటికి వెళ్ళాము.
1949లో నేను మానికొండకు వచ్చేసాను. అక్కడే వుండి పోతున్నాను. ఒకాయన దగ్గర నేను జీతం ఉంటున్నాను. ఆయన ఏమన్నారంటే ‘నీవు వెళ్లి చేను దగ్గర కాపలా వుండు’ అన్నారు. నేను చేను దగ్గర కాపలా ఉన్నాను. అక్కడ నిద్రపోతూ ఉన్నప్పుడు తంబిగారు, ఇద్దరు అమ్మగార్లు కలలో కనిపించారు. కలలో కనిపించి “మీరు నన్ను గురించి ప్రార్ధన చేస్తున్నారు” అన్నారు. నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు. నేను తుళ్ళిపడి లేచాను. లేచి చూసే సరికి ఎవరూ లేరు. ఇక గబగబా నేను కాసేపు ప్రార్ధన చేసుకున్నాను. నాకు మొదటి నుండి ఆ అలవాటు వుంది. ప్రార్ధన చేసుకునే సరికి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి “నన్ను గురించి ఎక్కడైనా సరే ధర్మం అడిగి
నాకు గుడి కట్టించండి,” అని
ఆ ఒక్కమాట అన్నారు.
అంతే మళ్ళీ నాకు
కనబడలేదు. నేను ఈ సంగతిని పెద్దలకు చెప్పాను. మరియదాసు గారికి, కిరీటం గారికి ఇంకా యోసేపు గారికి అలా
అయిదు ఆరుగురు పెద్దలతో ఇలా జరిగిందని చెప్పాను. అంటే ఇప్పుడు అబ్బాయిగారి (దొర) దగ్గరికి వెళ్లి అడుగుదాం. జోజప్ప గారికి ఇక్కడ స్థలం ఏర్పాటు చేయమని
అడుగుదాం, అని మేమందరం అనుకొని అబ్బాయి
గారి దగ్గరకు వెళ్ళాం. ఆయన
ఏం చెప్పారంటే
‘స్థలం మీరు చూడండి
నేను ఇప్పుడే మీకు కొని ఇస్తాను’ అని అన్నారు. కొని
ఇచ్చారు. వారే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ, రాయి కొడుతుంటే ఆ రాయి తీసుకొచ్చి పునాదులు
కూడా ఏర్పాటు చేశారు. అంత
వరకు జరిగింది.
ఆయన దగ్గరుండే
సిలువ కొయ్యదే.
సుమారు అడుగులోపు
ఉండేది. చేతిలోనే ఉండేది.
No comments:
Post a Comment