సాక్ష్యం 1
పేరు : పసల తోమస్
తండ్రి : లూర్దయ్య
గ్రామం : లూర్ధునగర్, D. No. 47-1-15, మదర్ తెరెసా స్ట్రీట్, గుణదల, విజయవాడ.
జన్మస్థలం : గొట్టుముక్కల గ్రామం, జగన్నాధపురం విచారణ.
వయస్సు : 93 సం.లు (1915 Jan 14)
నాకు 20 సంవత్సరముల వయస్సులో విజయవాడ రావడం జరిగినది. కల్దరారో స్వామి దగ్గర పని చేసే వంట [మాదాను] శౌరి మా బావగారు. అందుచే ప్రార్ధన నిమిత్తం తంబి గారిని గొట్టుముక్కల అను మా గ్రామమునకు పంపటం జరిగినది. అది శుక్రవారము మరియు తపస్సు కాలము. ఆ రోజు షుమారు మధ్యాహ్నం 2 గంటల సమయములో తంబిగారు మా గ్రామములోని దేవాలయం దగ్గరకు వచ్చి, “ప్రార్ధన చేసుకుంటాను, దేవాలయం తాళం తీయండి” అని మా నాన్నగారిని అడగటం జరిగింది. మా నాన్న గారు ఉపదేశి అగుటచే దేవాలయం తాళం మా ఇంటి వద్దే వుండేది. అప్పుడు మా నాన్న గారు నాకు తాళం ఇచ్చి గుడి తలుపులు తెరువమని చెప్పారు. అప్పుడు తాళం చెవి తెచ్చి నేను తాళం తీయటం జరిగినది.
అప్పుడు తంబి గారు లోపలికి ప్రవేశించి, ప్రార్ధన చేయటం ప్రారంభించారు. నేను మాత్రం బయట ఆడుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ వున్నాను. సాయంత్రం 6 గంటల వరకు తంబిగారు గుడిలో నుండి బయటకు రాలేదు. అప్పుడు “దూది, దూది,” అని తంబిగారు అరిచారు. అప్పుడు నేను ఆయన కంగారు చూచి ఇంటికి వెళ్లి దూది తీసుకుని వచ్చాను. నన్ను తన అరచేతులను తుడవ మన్నారు. దూదితో తన రెండు అరచేతుల మరియు కాళ్ళ గాయాల నుండి కారిన రక్తాన్ని తుడిచాను. తుడిచే ముందు కనిపించిన గాయాలు దూదితో తుడిచిన తర్వాత గాయాలు కనిపించలేదు.
తరువాత 8 గంటల ప్రాంతములో భోజనం చేయమని తంబి గారిని కోరాను. కాని ఆ రోజు శుక్రవారం అగుటచే “చెయ్యను” అని చెప్పారు. పడుకోవడానికి మంచం గుడి దగ్గరకు తీసుకుని రమ్మన్నారు. నేను మా ఇంటి వద్ద ఒక మంచం తీసుకు వచ్చి గుడిలో
వేసాను. అప్పుడు ఆయన నాతో
పాటు గుడిలో పడుకోమన్నారు. నేను
పడుకోనని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను
గట్టిగా పట్టుకొని మంచం మీద పడుకో పెట్టారు. నా ప్రక్కన ఆయన పడుకున్నారు. తరువాత నాకు వెంటనే నిద్ర పట్టింది.
తెల్లవారి లేచి చూసే సరికి మంచం మీద తంబిగారు లేరు. అప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాను.
తరువాత
నేను బావగారైన [మాదాను] శౌరిగారి దగ్గరకు పెద్దఅవుటపల్లి రావడం జరిగినది. నేను ఒక వారం రోజుల పాటు అక్కడే వున్నాను. ‘రాక రాక వచ్చావు కొద్ది రోజులు వుండి వెళ్ళు’మని
మా బావగారి కోరిక మేరకు ఉండిపోయాను.
నేను
అవుటపల్లిలో వుండగా తంబిగారు నన్ను పిలిచి అన్నం వండమన్నారు.
అప్పుడు నేను అన్నం వండాను. అన్నం కుండమీద మూత వేయమన్నారు. ఆయన చెప్పినట్లు నేనే వేసాను. తరువాత తంబిగారు ఇంటికి తాళం వేసి మా బావగారైన శౌరిగారికి ఇచ్చి వెళ్ళారు. తరువాత ఆయన మూడు రోజులు వరకు రాలేదు. మూడు రోజులు తర్వాత వచ్చి మా బావగారిని తాళం అడిగి
తీసుకొని నన్ను తన ఇంటివద్దకు తీసుకు వెళ్ళారు.
తీసుకు వెళ్లి తాళం నన్ను తీయమన్నారు.
తాళం నేనే తీసాను. నీవు
వండిన అన్నం కుండ మీద మూత తీయి అన్నారు, తీసి చూడగా అన్నంలో నుంచి అప్పుడే వండిన అన్నం మాదిరిగా వేడివేడిగా పొగలు
వెళుతున్నాయి. నేను ఆశ్చర్యానికి
గురయ్యాను. నాకు జరిగిన రెండు
సంఘటనలు మా బావగారికి చెప్పాను. ఆయన
ఏవో అద్భుతాలు చేస్తున్నారని శౌరిగారు నాకు చెప్పారు.
గొట్టుముక్కల గ్రామంలో తంబిగారు, నేను సహవాసం చేసిన దేవాలయం ఇప్పటికీ వున్నది. అప్పటి విచారణ గురువు అంబ్రోస్ బట్టిస్టా స్వాముల వారు. ఇప్పుడు ఆయన సమాధి వద్దకు వచ్చే వారికి ఎన్నో మేలులు జరుగుచున్నాయి అని తెలిసి ఆయనతో రెండు రోజులు గడిపి ఆయన అద్భుతాలు, పంచ గాయలు ప్రత్యక్షంగా చూశానని సాక్ష్యం ఇచ్చుచున్నాను.
పసల తోమస్
11-9-2008
పసల తోమస్ |
No comments:
Post a Comment