జోసఫ్ తంబిగారు ఆంధ్రావనిలో
అడుగిడిన కొన్ని రోజులలోనే అతనొక అసాధారణ వ్యక్తియని, భక్తి పరుడని, దైవాను భూతుడని, అద్భుత
వ్యక్తియని, ప్రార్ధనా
పరుడని, దేవుని
కొరకు ‘పిచ్చివాడ’ని, నిరాడంబరుడని, సర్వసంఘ
పరిత్యాగియని, దీనాత్ముడని, వినయాత్ముడని, పునీతుడని, ఆయనతో పరిచయ మున్నవారు, ఆయన గురించి
విన్నవారు త్వరలోనే గ్రహించారు.
క్రీ.శ. 1999వ సంవత్సరములో
కపూచిన్ గురువులు తమ సమావేశములో, బ్రదర్ జోసఫ్ తంబిగారి ధన్యత / పునీత పట్టమును
ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కపూచిన్ సభాధిపతికి [జనరల్ మినిష్టరు], వారి సలహా
బృందానికి మరియు
కపూచిన్ జనరల్ పోస్టులెటర్ వారికి తెలియ జేయగా, ఎంతగానో
సంతోషించి అనుమతిని ఇచ్చియున్నారు. స్థానిక మేత్రాణులకు తెలియజేసి వారిని ఈ ధన్యత
/ పునీత పట్టం కార్యక్రమాన్ని ప్రారంభించుటకు కావలసిన అనుమతిని కోరమని
చెప్పియున్నారు.
31 మార్చి 2004న వ్రాసిన లేఖ
ద్వారా, ఆనాటి
ఆంధ్ర-ఒడిశా కపూచిన్ వైస్ ప్రొవిన్షియల్ గురుశ్రీ తోమాస్ సెబాస్టియన్ వారు, అప్పటి
విజయవాడ మేత్రాణులైన ప్రకాష్ మల్లవరపు వారికి తెలియజేసి, అనుమతిని
ఇవ్వవసినదిగా కోరియున్నారు. సంతోషముగా ఇది దైవ నిర్ణయమని భావించి, తన మేత్రాసణ సలహా
బృందముతో సంప్రదించిన తరువాత ధన్యత / పునీత పట్ట కార్యక్రమాన్ని ప్రారంభించుటకు 7
ఏప్రిల్ 2004న వ్రాసిన లేఖ ద్వారా అనుమతిని ఇచ్చియున్నారు.
19 మార్చి 2005న లేఖ ద్వారా ‘ఆంధ్రప్రదేశ్
బిషప్స్ కౌన్సిల్’ అధ్యక్షలు
కాగితపు మరియదాస్ మేత్రాణులు ఇతర మేత్రాణులను సంప్రదించిన తరువాత, వారి అనుమతిని
కూడా ఇచ్చియున్నారు.
ఈ ప్రక్రియలో వాటికన్ కూడా తన
సమ్మతిని తెలపడం తప్పనిసరి. 15 అక్టోబరు 2005న లేఖద్వారా ఎలాంటి అభ్యంతరం లేదని
సర్టిఫికేట్ ఇచ్చియున్నది.
14 మే 2004న లేఖ ద్వారా
గురుశ్రీ ఇన్నయ్య పోలిశెట్టి వారిని వైస్ పోస్టులేటరుగా నియమించమని వైస్
ప్రొవిన్షియల్ గురుశ్రీ తోమాస్ సెబాస్టియన్ వారు పోస్టులేటరు గురుశ్రీ ఫ్లోరియో
తెసారి వారిని అభ్యర్ధించారు. 20 జూన్ 2004న ఇన్నయ్య పోలిశెట్టి వారు వైస్
పోస్టులేటరుగా నియమితులైనారు.
24 జూన్ 2007న అధికారికముగా బ్రదర్ జోసఫ్ తంబిగారు ‘‘దైవ సేవకుడిగా’’ ప్రకటింపబడినారు.
గురుశ్రీ ఇన్నయ్య పోలిశెట్టి వారు తమ
బాధ్యతలను 2012 వరకు కొనసాగించారు. వీరి తరువాత వైస్ పోస్టులేటరు బాధ్యతలను
గురుశ్రీ చెరియన్ పాలుకున్నెల్ వారు 28 జనవరి 2012న స్వీకరించి 2015 వరకు
కొనసాగారు.
ప్రస్తుతం, గురుశ్రీ
ప్రవీణ్ కుమార్ గోపు వారు వైస్ పోస్టులేటరుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
వీరు 16 జూన్ 2015న ప్రస్తుత పోస్టులేటరు గురుశ్రీ కార్లో కల్లోనిచే నియమింపబడినారు.
వీరి ఆధ్వర్యములో ధన్యత / పునీత పట్టం ప్రక్రియ ముందుకు కొనసాగుతుంది.
No comments:
Post a Comment