సాక్ష్యం 13
పేరు : తాడేపల్లి మనోహరమ్మ
వయస్సు : 81 సం.లు
వృత్తి : రిటైర్డ్ టీచర్
అడ్రస్ : కోడూరుపాడు (పోస్ట్), బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా, 521 110, ఆంధ్రప్రదేశ్
నేను 18 సం.ల వయస్సులో
వున్నపుడు, బ్రదర్ జోసఫ్ తంబి గారిని మొట్ట మొదటి సారిగా చూసాను. ఆయన మా ఇంటికి వచ్చి ఒక గ్లాసు మజ్జిగ
అడిగారు. అప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఆ తర్వాత చాలాసార్లు బ్రదర్ జోసఫ్ తంబి
గారిని చూశాను, గాని వ్యక్తిగతంగా నాకు పరిచయం తక్కువ. 1954లో జోసఫ్ శౌరికి 15 రోజులు అప్పుడు
ఆ బాలుడు ఎక్కువ పాలు త్రాగి మరణించే స్థితికి చేరాడు. అప్పడు నేను బ్రదర్ జోసఫ్ తంబి గారి
సమాధి వద్దకు వచ్చి ప్రార్ధించగా, నా బిడ్డ, ఆయన స్వస్థత ప్రార్ధనల ద్వారా రక్షింప బడ్డాడు. నాకు వెన్నుముక నొప్పి, మరియు మా గేదె అనారోగ్యంతో వుంటే తంబి
గారి ప్రార్ధన ద్వారా తగ్గింది.
తాడేపల్లి మనోహరమ్మ, కోడూరుపాడు
13 జులై 2009
తాడేపల్లి మనోహరమ్మ |
No comments:
Post a Comment