Wednesday, May 13, 2020

సాక్ష్యం 19

సాక్ష్యం 19

పేరు             :         ఫ్రాన్సిస్ జేవియర్ పుట్ల
తండ్రి            :         ఎలీషా
పుట్టిన తేది      :         16/01/1943
వృత్తి             :         రిటైర్డ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్
అడ్రస్            :         .నెం. 32 - 34 - 57
మసీదు వీధి, SRR కాలేజీ ఎదురుగా, మాచవరం, విజయవాడ, కృష్ణా జిల్లా.

శాంతి ఫ్రాన్సిస్ నా మొదటి కుమార్తె. తెలివి తక్కువగా పుట్టిన బిడ్డ, త్వరలోనే చనిపోయింది. నా భార్యకు చాలా బాధాకర మైనది. ఆరునెలల తరువాత కూడా ఆమె మనిషిగా తిరిగి అవ్వలేదు. తర్వాత ఆమెకు 24 గంటలు కడుపు నొప్పి వచ్చింది. ఆ సమయంలో, గాంధీ హాస్పిటలుకు తీసుకు వెళ్ళాము. ఆ సమయంలో ఆపరేషన్ చేయవలసి వచ్చినది. ఆపరేషన్ చేసేటప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండే ట్యూబ్ కత్తిరించి, ఆపరేషన్ ముగించారు. తరువాత కొంత కాలానికి మేమిద్దరం కలిసి తంబి గారి సమాధి వద్ద నిద్ర చేయుట జరిగింది. ఆ రోజు మాకు తంబి గారు ఎంతో మేలు చేశారు. దేవుని అనుగ్రహం వల్ల ఇద్దరు పిల్లలు పుట్టారు.

కేసరపల్లిలో ఒక ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. వారికి కూడా చాలా కాలం నుంచి పిల్లలు లేరు. వారు బ్రదర్ జోసఫ్ తంబి గారిని  కలిసారు. తంబిగారు వారితో,మీరు దేవుని యందు భక్తితో ప్రార్ధించండి, మీకు తప్పక బిడ్డ నిస్తారుఅని చెప్పి, వారితో పాటు ఆయన కూడా ప్రార్ధించారు. ఒక సంవత్సరం గడిచే సరికి వారికి బిడ్డ పుట్టింది.

ఫ్రాన్సిస్ జేవియర్ పుట్ల, విజయవాడ


 ఫ్రాన్సిస్ జేవియర్ పుట్ల

No comments:

Post a Comment