Saturday, May 16, 2020

సాక్ష్యం 16

సాక్ష్యం 16

పేరు             :         పీకా రామకోటి
S/O            :         ప్రకాశం
వయస్సు        :         85 సం.లు
వృత్తి             :         వ్యవసాయం
అడ్రస్            :         కేసరపల్లి  (పోస్ట్), గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

అపుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు కేసరపల్లిలో వుంటున్నారు. ఆ సమయంలో నేను కూలీలను తీసుకెళ్ళే మేస్త్రిగా వున్నాను. ఒక రోజు తంబి గారిని కూడా కూలికి పిలిచాను. వెంటనే మాతో పాటు వచ్చి పని చేసేవారు. పని చేయగా వచ్చిన కూలి డబ్బులు పేదలకు మొత్తం పంపేవారు. ఆయన కోసం మాత్రం కొత్త బట్టలు కొనేవారు కాదు. ఒక కాలు బోధకాలు, మాసిన గడ్డం, పొడవైన అంగీ ధరించి జీవించే వాడు.

మేము ఆ రోజుల్లో హిందువులం. ఆయన ద్వారా మేము జ్ఞానస్నానం పొందాము. మేమిద్దరం అప్పటినుంచి మంచి స్నేహితులుగా వున్నాం.

ఒకరోజు మేము చెరుకు పనికి వెళ్లాం. అక్కడ పని ఆపు చేసి తంబిగారు ఇలా చెబుతున్నారు. నా ఇంటిలో నుంచి మంగలి కాటయ్య అనే వ్యక్తి బియ్యం, కోడిపెట్ట, డబ్బు దొంగలిస్తున్నాడు అని చెప్పాడు. పని నుంచి ఇంటికి వచ్చి చూడగా అది నిజం అని తేలింది. అపుడు అందరూ తంబిగారిని నమ్మారు. మేము కతోలిక విశ్వాసం ప్రకారం జీవిస్తున్నాం. తంబిగారి ప్రార్ధనల ద్వారా, అద్భుతాలు జరుగుతున్నాయి. తంబిగారి ప్రార్ధన వల్ల నేను ఇప్పటికీ మంచి ఆరోగ్యంతో జీవిస్తున్నాను.

పీకా రామకోటి, కేసరపల్లి, 
1 ఆగష్టు 2009

 పీకా రామకోటి

No comments:

Post a Comment