అధ్యాయము 02
పునీత అస్సీసి పుర
ఫ్రాన్సిస్ తృతీయ సభ సభ్యుడు
ఈవిధంగా, జోసఫ్ తంబి ఫ్రెంచ్ కపూచిన్ మిషనరీలను ‘క్లొల్లం’ అను ప్రదేశములో కలుసుకొని, వారితో కొంత కాలము గడిపియున్నారు. కపూచిన్ సభలో చేరి మఠసభ సభ్యునిగా అగుటకు నిర్ణయించుకున్నారు.
ఆ కాలములో కపూచిన్ సభలో చేరిన ఆరంభములోనే
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి ‘తృతీయ సభ’కు చెందిన అంగీని ఇచ్చెడివారు. ఆవిధముగనే, జోసఫ్ తంబి క్రీ.శ. 1931/1932వ సంవత్సరములో ‘క్లొల్లం’లోని కపూచిన్ మఠములో చేరి ‘తృతీయ సభ’కు చెందిన అంగీని స్వీకరించారు.
ఆరంభ తర్ఫీదు అనంతరం, కపూచిన్ మఠవాసులు జోసఫ్ తంబిగారిని తరువాతి తర్ఫీదునకు
తీసుకొనుటకు నిరాకరించారు. దీనికి ముఖ్య కారణం,
జోసఫ్ తంబి
కుడికాలు బోదకాలు అగుటవలన, అలాగే తరుచూ భక్తి భావోద్రేకములకు
లోనై మూర్చవ్యాధి లక్షణములను కలిగియుండుట వలన,
మఠమును వీడి
వెళ్ళవసి వచ్చినది.
మఠమును వీడినప్పటికిని ‘తృతీయ సభ’ అంగీని ధరించే అనుమతి
ఉండెడిది. ఈవిధముగా, జోసఫ్ తంబి కపూచిన్ సభ
మఠమును వీడినప్పటికిని, స్థానిక మేత్రాణు
అనుమతితో తృతీయ సభ అంగీని ధరించియున్నారు. కపూచిన్ మిషనరీలతో కొద్దికాలము సహవాసము
తరువాత, జోసఫ్ తంబిగారు క్రీ.శ. 1933వ సంవత్సరములో కపూచిన్ సభ మఠమును వీడి యున్నారు.
కపూచిన్ సభ మఠమును వీడిన తరువాత, అనేక సార్లు స్వస్థమైన పాండిచ్చేరిని సందర్శించాడు. అచ్చటి
గ్రామాలను, దేవాలయాలను సందర్శిస్తూ, ప్రజలకు అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు స్థాపించిన ‘తృతీయ సభ’ను గురించి తెలియజేశాడు.
అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి జీవితమును ఆదర్శముగా తీసుకొని, తాను ఎక్కడికి వెళ్ళినను ‘తృతీయ సభ’ను గూర్చి తెలియజేస్తూ,
సభ సంఘాలను, శాఖలను ఏర్పాటు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించారు.
స్వస్థలములో తన బంధువులు తనను గుర్తించిన
తరువాత, తాను సందర్శించినప్పుడు, వారి కోరిక మేరకు వారి గృహాలో కొన్ని రోజుపాటు ఉండేవాడు.
వారితో పాటే భుజించేవాడు, ప్రార్ధించేవాడు.
ఉదాహరణకు,
జోసఫ్ తంబిగారు
పాండిచ్చేరిలో చాలా దగ్గరి బంధువైన ‘జోసఫ్ తంబి’ వారి ఇంటిని అనేకసార్లు సందర్శించారు. పాండిచ్చేరి
వెళ్ళినప్పుడల్ల, వీరి ఇంటిలో ఉండెడివారు.
ఆ యింటి ఇల్లాలు క్రైస్తవ భక్తిపరురాలు. జోసఫ్ తంబిగారిని భక్తిభావముతో
ఆహ్వానించి ఆతిధ్యమును ఇచ్చెడిది. వారు కలిసినపుడెల్ల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను
చర్చించుకునెడివారు. ప్రార్ధనలు చేసెడివారు. చుట్టుప్రక్కల వారుకూడా ఈ ప్రార్ధనలో
పాల్గొనెడివారు.
పునీత అస్సేసి పుర ఫ్రాన్సిస్ |
No comments:
Post a Comment