Tuesday, July 7, 2020

‘మనత్తిడల్’లో దైవ సేవ, తృతీయ సభ స్థాపన

అధ్యాయము 03
‘మనత్తిడల్’లో దైవ సేవ, తృతీయ సభ స్థాపన

 క్రీ.శ. 1933వ సంవత్సరములో, జోసఫ్‌ తంబి పాండిచ్చేరిని వీడి ప్రస్తుతం కుంభకోణంఅతిమేత్రాసణములో ఉన్న మణత్తిడల్‌అనే చిన్న గ్రామానికి ఇరువురు బాలురులతో వెళ్ళారు. అప్పటిలో మణత్తిడల్‌గ్రామము మైకేల్‌ పట్టిఅను విచారణ క్రింద ఉండెడిది. గురుశ్రీ జ్ఞానాధిక్యం వారు అప్పటి విచారణ గురువులు.

గురుశ్రీ జ్ఞానాధిక్యం గురువులతో తంబి

మణత్తిడల్‌గ్రామములో అడుగిడిన జోసఫ్‌ తంబిగారు ఆరంభములో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన వలసి వచ్చినది. తంబిగారిని మొదటి సారిగా చూసిన కొంతమంది కతోలిక క్రైస్తవులు ఆయన వేషధారణను బట్టి అతనిని అనుమానముగా చూశారు. ప్రార్ధనకై అక్కడనున్న చిన్న దేవాలయములోనికి ప్రవేశించుచుండగా వారు చూసి ఆయనను అడ్డుకున్నారు. దొంగ సన్యాసిఅని భావించి కొట్టబోయారు. వారు అడిగిన ప్రశ్నన్నింటికి జోసఫ్‌ తంబిగారు ఓపికగా సమాధానాలిచ్చి యున్నాడు.

జోసఫ్‌ తంబిగారు నిజమైన దైవభక్తుడు అని తెలుసుకొని వారు ఊరకున్నారు. కొన్ని రోజులపాటు అతని ప్రవర్తనను గమనింపసాగారు. కొద్ది కాములోనే తన మంచి ప్రవర్తనతో, మాటలతో అచ్చటి ప్రజల మన్ననలను చూరగొన్నాడు. వారుకూడా జోసఫ్‌ తంబిగారిని గొప్ప దైవసేవకునిగా గుర్తించారు.

నెమ్మదిగా వారితో స్నేహమును చేసుకున్న జోసఫ్‌ తంబిగారు అచట ఉండటానికి నివాస స్థానమును కోరియున్నారు. అచ్చటి ప్రజలు దేవాయ ఆవరణలో ఒక చిన్న ఇంటిని నిర్మించి దానిలో ఉండుటకు ఏర్పాటు చేసారు. దేవాలయము వద్దకు తరచుగా ప్రజలను పిలచి ప్రార్ధనలు చేసేవారు. జబ్బు పడిన వారికి తనకు తెలిసిన ఆకులతో మందులను తయారు చేసి ఇచ్చేవారు. వారిపై చేతు చాచి, ప్రార్దించి, ఆపై సిలువ గురుతు వేసి, వారి రోగాలను స్వస్థపరచేవారు.

చిన్న పిల్లలకు సత్యోపదేశ సంక్షేపాన్ని బోధించేవారు. పిల్లలను ఎంతో ఆప్యాయముగా చేరదీసేవారు. వారు విధేయించని యెడల, వారి ఎదుట మోకరిల్లి విధేయించమని ప్రాధేయపడెడివారు.

మణత్తిడల్‌గ్రామములోనున్న కతోలిక క్రైస్తవులను, దివ్యపూజాబలిలో, ఆరాధనలో పాల్గొనడానికి, ప్రతీ ఆదివారము మరియు మొదటి శుక్రవారము ప్రోగుచేసి మైకేల్‌ పట్టివిచారణ దేవాలయమునకు తీసుకొని వెళ్లేవారు.

క్రీ.శ. 1933-1934 సంవత్సర కాములో, జోసఫ్‌ తంబిగారు మణత్తిడల్‌గ్రామములో అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి తృతీయ సభను స్థాపించియున్నారు. మణత్తిడల్‌వాస్తవ్యులు అయిన హనస్వామిగారి తల్లి, వేరొక స్త్రీ దీనిలో చేరిన మొదటి సభ్యులు. ఆ తరువాత తృతీయ సభసభ్యులుగా ఎంతోమంది చేరారు. నేటికి అచ్చటి ప్రజలు తృతీయ సభస్థాపకులుగా జోసఫ్‌ తంబిగారిని గుర్తుచేసుకొంటూ ఉంటారు.

క్రైస్తవ పరిపూర్ణ మార్గమును అనుసరించుటకు ఆసక్తి చూపు భక్తిగల క్రైస్తవుల కొరకు, అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారు 12వ శతాబ్దములో పురుషులకు స్థాపించిన మొదటి సభ, స్త్రీకు స్థాపించిన రెండవ సభ కాకుండా, ‘తృతీయ సభను స్థాపించియున్నారు. కార్డినల్‌ హ్యుగోలినో వారి సహాయముతో ఒక నియమావళిని ఏర్పాటు చేయగ, తొమ్మిదవ గ్రెగోరి పోపుగారు దానిని ఆమోదించారు. మొదటి సంఘాలు తపోసంఘాలుగా పిువబడ్డాయి. కాలక్రమేణ, ఈ సభ తపోసభగా పిలివబడినది. ప్రస్తుతం ఫ్రాన్సిస్‌ తృతీయ సభలేక సెక్యుర్‌ ఫ్రాన్సిస్కన్‌ ఆర్డర్‌’ (ఎస్‌.ఎఫ్‌.ఓ.) గా పిువబడుచున్నది.

మణత్తిడల్‌లో తృతీయ సభస్థాపనను పురస్కరించుకొని 26 జనవరి 1984, 50 వసంతాల జూబిలిని మణత్తిడల్‌లో అప్పటి విచారణ గురువు అయిన గురుశ్రీ ఎస్‌. సూసయ్‌ ఆధ్వర్యములో ఘనముగా కొనియాడారు. ఆ రోజున తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం మేత్రాసణములనుండి తృతీయ సభసభ్యలను ఆహ్వానించి ఒక రోజు సెమినారును ఏర్పాటు చేసియున్నారు. ఇదే ఆహ్వానాన్ని అవుటపల్లిలోని విచారణ గురువుకు కూడా పంపడం జరిగింది.

ఆరోజు చర్చకు ఎన్నుకున్న మూడు అంశములు:

(అ). పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి సువార్తా జీవితము,

(ఆ). బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సువార్తా జీవితము,

(ఇ). తృతీయ సభసభ్యుల సువార్తా జీవితము.

జోసఫ్‌ తంబిగారు క్రీ.శ. 1933-1935 మధ్య కాలములో మణత్తిడల్‌గ్రామములో ఉన్నప్పుడు ఉపాధ్యాయునిగా పని చేస్తున్న ఏ. ఆరోగ్యసామి, ఉపదేశిగా కూడా ఆ గ్రామములో తన సేవలను అందించాడు. ఉపాధ్యాయుడు, ఉపదేశి అయిన ఏ. ఆరోగ్యసామి, జోసఫ్‌ తంబిగారి ప్రేషిత కార్యములో ఎంతగానో తన సహాయ సహకారాలను అందించి యున్నాడు.

అప్పటికి ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసిన ఏ. ఆరోగ్యసామి, అవుటపల్లిలోని బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి సమాధిని, పుణ్యక్షేత్రాన్ని క్రీ.శ. 1985వ సంవత్సరములో సందర్శించారు. 

మణత్తిడల్‌గ్రామమును విచారణగా చేయడానికి జోసఫ్‌ తంబిగారు ఎంతగానో కృషి చేశారు. అప్పటి మేత్రాణుల వద్దకు వెళ్లి, ‘మణత్తిడల్‌గ్రామములో గురువు అవసరతను తెలియజేసి, అచ్చట స్థానికముగా ఉండుటకు ఒక గురువును పంపుమని కోరియున్నారు. దాని ఫలితముగనే మేత్రాణులు గురుశ్రీ పి.ఎస్‌. ఇగ్నేషియస్‌ వారిని మణత్తిడల్‌గ్రామమునకు పంపియున్నారు.

తమ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి వారి మధ్యన ఒక గురువు వచ్చినందుకు మణత్తిడల్‌ప్రజలు ఎంతగానో సంతోషించారు, సంబరపడ్డారు.

గురుశ్రీ పి.యస్. ఇగ్నేషియస్ వారితో తంబి
జోసఫ్‌ తంబిగారు వారితో, ‘‘ఇప్పుడు మీ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి ఒక గురువు మీ మధ్యన ఉన్నారు. ఇక నేను మీనుండి సెలవు తీసుకొని దైవసేవను కొనసాగించుటకు వేరొక చోటుకు వెళతాను’’ అని చెప్పియున్నారు. అది విన్న ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. వెళ్లిపోవద్దని జోసఫ్‌ తంబిగారిని ఎంతగానో ప్రాధేయపడ్డారు. కాని జోసఫ్‌ తంబిగారు క్రీ.శ. 1936వ సంవత్సరములో అచటనుండి సువార్తా నిమిత్తమై వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయారు.

మణత్తిడల్‌గ్రామములో స్థానికముగా ఉండుటకు ఒక గురువు రావడానికి జోసఫ్‌ తంబిగారు చేసిన ఎనలేని కృషిని గురుశ్రీ పి.ఎస్‌. ఇగ్నేషియస్‌ వారు రికార్డులో వ్రాసి ఉంచారు.

జోసఫ్‌ తంబిగారు స్వరూపములను చాలా చక్కగా చేసెడివారు. మణత్తిడల్‌గ్రామములో ఉన్నప్పుడు పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్, పునీత పాదువాపురి అంతోని, జేసు తిరు హృదయ స్వరూపమును చేసి మణత్తిడల్‌దేవాయములో ప్రతిష్టింప చేసియున్నాడు. ఎప్పుడైతే అచటి ప్రజలు ఆ స్వరూపములకు రంగులు వేయమని కోరారో, అప్పుడు జోసఫ్‌ తంబిగారు వాటిని పగలగొట్టి నాశనం చేశాడు. వాటివలన ప్రజలు తనను కలకాలం గుర్తుంచుకుంటారని భావించాడు. ప్రజలు తనను కలకాలం గుర్తుంచుకోవడం జోసఫ్‌ తంబిగారికి ఎంతమాత్రము యిష్టము లేకుండెను. అందుకే ఆ స్వరూపములను శాశ్వతముగా నిర్మూలించాడు.

మణత్తిడల్‌గ్రామములో జోసఫ్‌ తంబిగారు తానే స్వయముగా తన చేతుతో పునీత స్తెఫానుగారి పేరిట ఒక పీఠమును నిర్మించాడు. ఆ తరువాత అప్పటి విచారణ గురువు క్రీ.శ. 1953వ సంవత్సరములో ఈ పీఠమును సిమెంటుతో ప్లాస్టర్‌ చేసియున్నారు.

26 జనవరి 1942వ సంవత్సరములో మణత్తిడల్‌గ్రామము ఒక విచారణ కేంద్రముగా ఏర్పాటు చేయబడినది. గురుశ్రీ స్తెఫాను మొట్టమొదటి విచారణ గురువుగా నియమింప బడినారు.

No comments:

Post a Comment